కర్ణాటక : ఐటీ సిటీలో ఆడికారు దుర్ఘటనలో ఎమ్మెల్యే తనయుడు, మరో ఆరుగురు యువతీ యువకుల మరణం సంచలనాత్మకమయ్యింది. హై ఎండ్ కారుతో యువత సరదాలు కుటుంబాలకు శోకాన్ని మిగిల్చాయి. ఈ కేసులో కొత్త కొత్త అంశాలు నెమ్మదిగా వెలుగు చూస్తున్నాయి. కరుణాసాగర్, అతని స్నేహితులు మిడ్ నైట్ పార్టీ చేసుకుని జాలీ రైడ్ చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు రోడ్ల మీద 90-100 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం కష్టం. ప్రమాద సమయంలో 150కిలోమీటర్లు కంటే ఎక్కువ వేగంతో కారు డ్రైవింగ్ చేశారంటే మత్తులో ఉండి ఉండాలని పోలీసులకు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో హెచ్ఎస్ఆర్ లేఔట్, కోరమంగల, ఏంజీ రోడ్డు ఇందిరానగర హోటల్స్, పబ్ లను పరిశీలించాలని నిర్ణయించారు. కరుణాసాగర్ మిత్రబృందం ఎక్కడెక్కడ తిరిగిందో పసిగట్టేందుకు అక్కడి సీసీ కెమెరాల చిత్రాలను తనిఖీ చేయనున్నారు. యాక్సిడెంట్ జరిగిన చోట రోడ్డు కుడివైపుకు వంపు ఉండగా, కారు ఎడమవైపుకు నేరుగా దూసుకుపోయింది. అక్కడ కారును అదుపు చేయలేకపోయారు.