ఇష్టమైన పాట పెట్టలేదని.. పెళ్లిలోంచి అలిగి వెళ్లిన వధువు.. వీడియో వైరల్...

First Published | Aug 26, 2021, 9:40 AM IST

వధువుగా తన ఎంట్రీ అయ్యే సమయంలో ఓ అందమైన పాటను ప్లే చేయాలని ఎంపిక చేసుకుంది. డీజేకు పదే పదే చెప్పింది. కానీ ఆ సమయానికి అతను ఆ పాట ప్లే చేయలేదు. అంతే వధువుకు కోపం వచ్చింది.

Desi Bride Refuses

గతంలో పెళ్లికూతురు అంటే రాబోయే జీవితం గురించి కలలు కంటూ.. సిగ్గులమొగ్గై పెళ్లి పీటల మీద కూర్చుని.. అబ్బాయితో తలొంచుకుని తాళి కట్టించుకునేది. కానీ ఇప్పుడా ట్రెండ్ మారిపోయింది. పెళ్లి కూతురికి తన పెళ్లిలో ప్రతీ అంకం తనిష్టప్రకారమే నడవాలని కోరిక ఉంటోంది. నిజానికి ఇది మంచి పరిణామం. అమ్మాయిల్లో పెరిగిన స్పృహను.. ఇండిపెండెన్సీకి ప్రతీక. 

Desi Bride Refuses

పెళ్లి కొడుకు ఎంపికతో మొదలై.. పెళ్లి బారాత్ వరకు ప్రతీ చిన్న అంశంలోనూ తమదైన ముద్ర ఉండాలని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి కూడా అలాగే కోరుకుుంది. వధువుగా తన ఎంట్రీ అయ్యే సమయంలో ఓ అందమైన పాటను ప్లే చేయాలని ఎంపిక చేసుకుంది. డీజేకు పదే పదే చెప్పింది. కానీ ఆ సమయానికి అతను ఆ పాట ప్లే చేయలేదు. అంతే వధువుకు కోపం వచ్చింది. ‘అతనికి ఆ పాట పెట్టమని చెప్పండి. నేను అతనికి చెప్పాను’ అంటూ ఏడుపుగొంతుతో చెబుతోంది. 
 


Desi Bride Refuses

తనతో పాటు ఉన్న బంధువులు, స్నేహితులు పెడతాడు.. కంగారు పడకు అంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే.. అతనికి ఆ పాట పెట్టమని చెప్పండి. నేను అతనికి చెప్పాను..'పియా మోహే ఘర్ ఆయే' పాట పెట్టమని అంటూ రిపీట్ చేసింది. చివరికి డీజే ఆపాట ప్లే చేస్తే కానీ ఆ వధువు శాంతించలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ లో దీనికి సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు వెలువుడుతున్నాయి. 

శివానీ పిప్పెల్ అనే యువతి ఇన్ స్టాగ్రామ్ లో ఆగస్టు 15 న ఒక వీడియోను షేర్ చేసింది. ఇది శివానీ పెళ్లి వీడియో. తను  వివాహ వేదికమీదికి రావడానికి నిరాకరించినట్లు ఆ వీడియోలో ఉంది. దీనికి కారణం మనం ముందుగా చెప్పుకున్నదే. ఇష్టమైన పాటను ప్లే చేయకపోవడం. ఆ తరువాత ఒక నిమిషానికి పాట ప్లే చేశారని.. హ్యాపీ అని కూడా రాసుకొచ్చింది.

ఈ వీడియోలో పిప్పెల్, పింక్ లెహంగా ధరించి, కళ్లలో నీళ్లు తిరుగుతూ మాట్లాడుతుంది. ఈ వీడియోను ఈ నెల మొదట్లో శివాని పిప్పెల్ షేర్ చేసింది. అప్పటి నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్ల మంది వీక్షించారు. ఇక ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లలో 1.2 లక్షలకు పైగా 'లైక్‌లు',  వెయ్యికి పైగా కామెంట్స్ వచ్చాయి.

దీనికి రకరకాల స్పందనలు వచ్చాయి. ‘నేనూ ఇలాగే చేశాను’ అని ఒకరు స్పందించగా.. ‘వధువుకు ఓపిక లేనట్టుంది’ అని మరొకరు స్పందించారు. చాలామంది సూపర్ అంటే.. మరికొందరు ‘భలే, అది కూడా షేర్ చేశారే’ అని స్పందించారు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. 

Latest Videos

click me!