గూగుల్ క్రోమ్ యూజ‌ర్ల‌కు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే మీ డేటా గోవిందా.. !

First Published | Aug 11, 2024, 2:11 PM IST

Google Chrome warning  : రిమోట్ కోడ్ అమలును అనుమతించే ప‌లు లోపాల నేప‌థ్యంలో విండోస్, మాక్, లినక్స్ లోని గూగుల్ క్రోమ్ వినియోగదారులకు భార‌త ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. విలువైన స‌మాచారం చోరీకి గుర‌య్యే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొంది. 
 

Google Chrome

Google Chrome warning : గూగుల్ క్రోమ్ యూజ‌ర్ల‌ను భార‌త ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) ఆధ్వర్యంలోని సైబర్ సెక్యూరిటీ వాచ్‌డాగ్ గూగుల్ క్రోమ్ యూజ‌ర్ల‌ డేటా చోరీ అయ్యే అవకాశముందని హెచ్చ‌రించింది. విండోస్, మాక్, లిన‌క్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో క్రోమ్ వాడుతున్న‌వారిపై ప్ర‌భావం ప‌డే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొంది. 

CERT-In ప్రకారం డెస్క్‌టాప్ ల‌లో గూగుల్ క్రోమ్ యూజర్ల‌ సిస్టమ్‌లో ఏకపక్షంగా కోడ్‌ని అమలు చేయడానికి రిమోట్ అటాకర్ ద్వారా ఉపయోగించే ప‌లు లోపాల‌ను గుర్తించిన‌ట్టు తెలిపింది. వెబ్‌ట్రాన్స్‌పోర్ట్‌లో తగినంత డేటా వినియోగం హద్దులు దాటిపోవడంతో సహా అనేక కారణాల వల్ల ఈ లోపాలు వ‌చ్చిన‌ట్టు సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది.

Latest Videos


దీని కార‌ణంగా మీకు తెలియ‌కుండానే మీ సిస్ట‌మ్ డేటా హ్యాక్ గుర‌య్యే అవ‌కాశ‌ముంది. కాబ‌ట్టి వెంట‌నే క్రోమ్ ను అప్ డేట్ చేసుకోవాల‌ని పేర్కొంది. 127.0.6533.88 కంటే ముందు వెర్ష‌న్ల‌ను అప్ డేట్ చేసుకోవాల‌ని పేర్కొంది. విండోస్, మ్యాక్ ల‌లో 127.0.6533.88/89 కంటే ముందు ఉన్న వెర్ష‌న్లు ఎక్కువ‌గా ప్ర‌భావిత‌మైన వాటిలో ఉన్నాయ‌ని తెలిపింది. లేటెస్ట్ వెర్ష‌న్ల‌కు అప్డేట్ చేసుకోవాల‌ని సైబర్‌సెక్యూరిటీ ఏజెన్సీ సూచించింది.

ఇటీవ‌ల ఫోర్బ్స్ నివేదిక‌లో ఆపిల్, గూగుల్ తమ వెబ్ బ్రౌజర్‌లలో సంవత్సరాలుగా ఉన్న క్లిష్టమైన భద్రతా లోపాల‌ను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాయని పేర్కొంది. ఈ లోపాలు ముఖ్యంగా ఐపీ అడ్ర‌స్ కు సంబంధించిన వాటితో పాటు డేటా చోరీకి ఈ లోపాలు సైబర్ నేరస్థులచే ఉపయోగించబడుతున్నట్లు నివేదించింది. 

google chrome features

వివిధ రిపోర్టుల ప్ర‌కారం.. ఈ లోపాలు కొన్ని సంవ‌త్స‌రాలుగా ఉన్నాయి. అయినప్పటికీ డెవలపర్లు ఇటీవల వరకు దీనిని గమనించలేదు. ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఒలిగో పరిశోధకులు ఈ లోపాల‌ను వెలికితీశారు. మ‌రీ ముఖ్యంగా ఐపీ అడ్ర‌స్ 0.0.0.0 గా ఉంటూ ఆక‌ర్షించే హానిక‌ర‌మైన‌ లింక్ ను క్లిక్ చేసేలా చేసి డేటా చోరీకి పాల్ప‌డుతున్నార‌ని పేర్కొంది. 

click me!