భారతీయ యువతను కొంటున్న చైనా కంపనీ... ఏం చేస్తున్నారో తెలుసా?

First Published | Aug 8, 2024, 4:04 PM IST

భారత యువతను కొనుగోలు చేస్తుంది ఓ చైనీస్ కంపనీ.  ఇలా లక్షలుపోసి మన యువతను ఆ కంపనీ ఎందుకు కొనుగోలు చేస్తుందో తెలుసా..? 

Human trafficking

Human trafficking : భారత యువతను చైనీస్ కంపనీకి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ  మానవ అక్రమరవాణాకు పాల్పడి యువత జీవితాలతో ఆడుకుంటున్న నేరస్తుడిని కేరళ పోలీసులు గుర్తించారు. కొచ్చి లోని పల్లురుత్తి ప్రాంతానికి చెందిన అఫ్సర్ అష్రఫ్ ను అదుపులోకి తీసుకున్న విచారణ చేపట్టారు.  
 

Human trafficking

అసలేం జరిగిందంటే : 

కొచ్చి నగరంలోని పల్లురుత్తి ప్రాంతానికి చెందిన అష్రఫ్ విదేశాల్లో ఉద్యోగాల పేరిట యువతను మోసం చేస్తుంటాడు. ఇలా ఇటీవల ఆరుగురు యువకులను మాయమాటలతో నమ్మించాడు. ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేలు తీసుకుని లావోస్ కు తీసుకెళ్లాడు.  

ఇలా అక్రమంగా లావోస్ కు తరలించిన యువకులను ఓ చైనీస్ కంపనీకి అమ్మకానికి పెట్టాడు. కంపనీతో ఒక్కో యువకుడికి రూ.4 లక్షలకు ఢీల్ కుదుర్చుకుని అమ్మేసాడు. ఇలా దేశంకాని దేశంలో అంగట్లో సరుకులా మారిపోయారు యువకులు. ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఆ చైనీస్ కంపనీలో ఇంతకాలం నరకం అనుభవించారు. 


Human trafficking

యువకులను కొనుగోలు చేసిన చైనీస్ కంపనీ ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతుంటుంది. కొనుగోలు చేసిన యువకులను కూడా ఇలాంటి చట్టవిరుద్ద కార్యకలాపాల కోసం వినియోగించింది. తమ పాస్ పోర్టులు సదరు కంపనీ వద్దే వుండటంతో యువకులు చెప్పినట్లు చేయాల్సి వచ్చింది. ఇలా గత కొంతకాలంగా లావోస్ లో భారత యువకులు నరకం అనుభవించారు. 

Human trafficking

అయితే తాజాగా చైనీస్ కంపనీ బారినుండి తప్పించుకున్న యువకుడి ద్వారా ఈ విషయం ఇక్కడున్న కుటుంబసభ్యులకు తెలిసింది. వెంటనే వారు కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు యువకులను లావోస్ కు తీసుకెళ్లిన అష్రఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ద్వారా యువకులను కొనుగోలు చేసిన  కంపనీని గుర్తించారు. అక్రమంగా నిర్భంధించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయించిన సదరు చైనీస్ కంపనీపై కూడా పోలీసులు కేసు నమోదు చేసారు. 

Human trafficking

లావోస్ నుండి కార్యకలాపాలు సాగిస్తున్న చైనీస్ కంపనీ భారతీయులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో అష్రఫ్ తో పాటు మరికొందరి ప్రమేయం కూడా ఈ  వ్యవహారంలో వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా విచారణ సాగిస్తున్నారు. యువకులు విక్రయం, ఆన్ లైన్ స్కామ్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Latest Videos

click me!