ఇండిపెండెన్స్ డే 3.O : సరికొత్తగా స్వాతంత్య్ర వేడుకలు... మోదీ గట్టిగానే ప్లాన్ చేసారుగా..!

First Published | Aug 9, 2024, 7:42 PM IST

కేంద్ర ప్రభుత్వం ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సరికొత్తగా నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసారు. 

Independence Day

స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రధాని నరేంద్ర మోదీ మరో క్యాంపెయిన్ ప్రారంభించారు. స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ప్రొఫైల్ పిక్ మార్చుకున్న ఆయన దేశ ప్రజలంతా ఇలాగే మార్చుకుని దేశ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.  మువ్వన్నెల జాతీయ జెండాను దేశ ప్రజలందరూ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకొని ‘హర్ ఘర్ తిరంగ’ క్యాంపెయిన్ చేపట్టాలని సూచించారు. ఈ స్వాతంత్ర్య వేడుకలను చరిత్రాత్మక సంఘటనగా మార్చాలని ప్రధాని పిలుపునిచ్చారు.
 

Independence Day

ఆగస్ట్ 15కు సమయం దగ్గరపడుతోంది...దీంతో యావత్ దేశం స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు అవుతోంది. ఇలా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత... ఎన్డిఏ 3.0 ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుపుకోబోతున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవమిది. అందువల్లే దీన్ని మరింత ప్రత్యేకంగా నిర్వహించాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు తిరంగా యాత్రలు నిర్వహిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తెలిపారు. ఆగస్టు 14న దేశ విభజన సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా జిల్లాల్లో మౌన దీక్షలు నిర్వహిస్తారని చెప్పారు.


Independence Day

 స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారాన్ని చిరస్మరణీయమైన జాతీయ ఉద్యమంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ముందుగా తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్‌గా జాతీయ జెండాను అప్డేట్ చేశారు. దేశ పౌరులూ ఇలా చేయాలన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. ‘ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో, హర్ ఘర్ తిరంగను మరోసారి మరచిపోలేని ప్రజా ఉద్యమంగా మారుద్దాం. నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని మారుస్తున్నాను. నాలాగే మీరందరూ ప్రొఫైల్ పిక్‌ మార్చుకొని సెలబ్రేషన్స్ పాల్గొనాలని కోరుతున్నాను. అలాగే, మీ సెల్ఫీలను hargartiranga.comలో పంచుకోండి’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Independence Day

జూలై 28న తన రేడియో ప్రసారమైన ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ తొలిసారిగా ప్రకటించారు. మన్ కీ బాత్ 112వ ఎడిషన్‌లో హర్ ఘర్ తిరంగ అభియాన్‌ను జాతీయ పండుగగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

కాగా, ఆగస్టు 11 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తిరంగా యాత్రలు నిర్వహిస్తారు. ఆగస్టు 14న దేశ విభజన సంస్మరణ దినం సందర్భంగా దేశవ్యాప్తంగా జిల్లాల్లో మౌనదీక్షలు నిర్వహిస్తారు. ఆగష్టు 13 నుంచి 15వ తేదీ వరకు, పౌరులు తమ ఇళ్లు వ్యాపార సంస్థల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయవచ్చు. 2022లో హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశమంతా ప్రారంభమైంది. ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని.. తమ ఇళ్లు, భవనాలపై జాతీయ జెండాను ఎగురవేశారు.
 

Independence Day

ఇక ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి సర్టిఫికెట్ కూడా పొందవచ్చు. ఆన్‌లైన్‌లో మీ హర్ ఘర్ తిరంగ సర్టిఫికేట్‌ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

ముందుగా hargartiranga.com వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి. హోమ్‌ పేజీలో 'click to participate' బటన్‌పై క్లిక్‌ చేయండి.

మీ పేరు, ఫోన్ నంబర్, రాష్ట్రం, దేశాన్ని నమోదు చేయండి.

వివరాలను నమోదు చేసిన తర్వాత, ప్రతిజ్ఞ చదవండి. ‘నేను త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తాను. మన స్వాతంత్య్ర సమరయోధులు, వీరుల స్ఫూర్తిని గౌరవిస్తాను. భారతదేశ అభివృద్ధికి, పురోగతికి అంకితమవుతా’ అని ప్రమాణం చేయాలి.

జాతీయ జెండాతో మీ సెల్ఫీలను అప్‌లోడ్ చేయడానికి ‘take pledge’ (టేక్ ప్లెడ్జ్‌) బటన్‌పై క్లిక్ చేయండి. 

మీ చిత్రాన్ని ఉపయోగించడానికి పోర్టల్ అనుమతి కోరినప్పుడు ‘సమర్పించు’ క్లిక్ చేయండి

మీరు అలా చేసిన తర్వాత, మీరు జెనరేట్ సర్టిఫికేట్‌పై క్లిక్ చేసి, ప్రచారంలో మీ భాగస్వామ్యాన్ని నిరూపించుకోవచ్చు.

Latest Videos

click me!