రైతులా- కేంద్రమా: సెలబ్రెటీల్లో చీలిక.. కాకపుట్టిస్తున్న ట్వీట్ వార్

First Published Feb 4, 2021, 2:49 PM IST

రైతుల ఆందోళనలపై దేశంలో సెలబ్రెటీలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ప్రభుత్వానికి మద్ధతుగా కొంతమంది, రైతులకు మద్ధతుగా మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు

రైతుల ఆందోళనలపై దేశంలో సెలబ్రెటీలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ప్రభుత్వానికి మద్ధతుగా కొంతమంది, రైతులకు మద్ధతుగా మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. కేంద్రానికి మద్ధతుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్వీట్లు చేశారు.
undefined
దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు రైతుల ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయంటూ వరుస ట్వీట్లతో విరుచుకుపడింది కంగనా. అటు పాప్ స్టార్ రిహానా చేసిన ట్వీట్‌కు సైతం ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. ఫుల్ అంటూ ట్వీట్ చేసింది కంగనా. అయితే కంగనా ట్వీట్లను తొలగించింది ట్విట్టర్. ఆమె ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసింది.
undefined
అలాగే రైతుల ఉద్యమంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మనమందరం సమైక్యంగా వుండాలని, దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలగకూడదన్నారు. బయటి శక్తులు ప్రేక్షకుల మాదిరిగానే ఉండాలని, భారత అంతర్గత వ్యవహారాల్లోకి జోక్యం చేసుకోకూడదని సచిన్ తేల్చి చెప్పారు. భారత్ కోసం ఏ నిర్ణయమైనా భారతీయులే తీసుకోవాలని చెప్పారు టెండూల్కర్.
undefined
మరోవైపు ఖిలాడి అక్షయ్ కుమార్ కూడా ప్రభుత్వానికి మద్ధతుగా ట్వీట్ చేశారు. రైతులు మనదేశంలో ముఖ్యభాగమని వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇక విభేదాలు క్రియేట్ చేసేందుకు శ్రద్ధ చూపకుండా స్నేహపూర్వక తీర్మానానికి మద్ధతు తెలపాలని సూచిస్తూ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ట్వీట్‌ను జోడించారు అక్షయ్
undefined
మరికొందరు సెలబ్రెటీలు రైతులకు మద్ధతుగా నిలిచారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, తాప్సీ అన్నదాతలకు న్యాయం జరగాలంటూ ట్వీట్ చేశారు. రైతులు మన సమాజంలో ముఖ్య భాగమని.. వారి సమస్యలకు సరైన పరిష్కారం చూపాలంటూ ట్వీట్ చేశారు విరాట్. అన్ని పార్టీల మధ్య స్నేహ పూర్వక పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కోహ్లీ. ఇటువంటి సమయంలో అందరూ ఐక్యంగా వుండాలని సూచించారు విరాట్. ఇండియా టు గెదర్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు కోహ్లీ.
undefined
మరోవైపు వరుస బయోపిక్‌లతో బిజీబిజీగా మారిన తాప్సీ.. రైతులకు మద్ధతు పలికింది. రిహానా చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసి తాను రైతుల వైపు వున్నానని గుర్తుచేసింది. భారత్ ఐక్యంగా ఉందంటూ మిగతా సెలబ్రెటీలు చేసిన ట్వీట్లకు సెటైర్లు వేసింది. తాము చేసిన ట్వీట్ వల్ల దేశ ఐక్యత దెబ్బ తింటుందా అని ప్రశ్నించింది. రైతుల పక్షాన నిలవాలని కోరింది.
undefined
మరోవైపు పాప్ స్టార్ రిహానా చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలను ఉద్దేశిస్తూ ఈ నెల 2వ తేదీన ఓ ట్వీట్ పెట్టింది. సీఎన్ఎన్ వార్తా సంస్థ రాసిన కథనాన్ని తన ట్వీట్‌కు జోడిస్తూ దీని గురించి మనం ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు.
undefined
ఆ ట్వీట్‌పై దుమారం రేగుతోంది. రైతుల ఆందోళనలపై అంతర్జాతీయ వ్యక్తుల జోక్యం అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రిహానా ట్వీట్‌పై స్పందించారు. భారతదేశ ఐక్యతను ఏ ప్రచారం నిర్వీర్యం చేయలేదని స్పష్టం చేశారు. కొత్త శిఖరాలను చేరుకునే భారత్‌ను ఏ ప్రచారం అడ్డుకోలేదని.. భారత భవిష్యత్‌ను ఏ ప్రచారం నిర్ణయించలేదని, కేవలం ప్రగతి మాత్రమే దేశ భవిష్యత్‌ను నిర్దేశిస్తుందన్నారు. ఇక ప్రగతి సాధించేందుకు భారత్ కలిసి ఉంటుందన్నారు హోంశాఖ మంత్రి అమిత్ షా
undefined
అంతకు మందు విదేశాంగ మంత్రి జై శంకర్, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తమ ట్వీట్ల ద్వారా స్పందించారు.
undefined
మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనపై బ్రిటన్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్ త్వరలో చర్చించనుంది. వెస్ట్ మినిస్టర్ హాల్‌లో భారత్‌లో రైతుల ఆందోళన, మీడియా స్వేచ్ఛ అన్న అంశాలను చర్చిస్తుంది. ఈ అంశాలపై ఆన్‌లైన్ పిటిషన్‌లో లక్షకు పైగా సంతకాలు వచ్చాయి. దీంతో ఈ అంశంపై చర్చించాలని సమాచారం.
undefined
click me!