Shubhanshu Shukla: 40 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి భారతీయుడు

Published : Jun 25, 2025, 11:58 AM ISTUpdated : Jun 25, 2025, 12:01 PM IST

శుభాంశు శుక్లా ISS వైపు పయనించే తొలి IAF అధికారి. 1984లో రాకేష్ శర్మ అనంతరం అంతరిక్షంలోకి వెళ్లనున్న రెండో భారతీయుడిగా చరిత్రలో నిలవబోతున్నారు.

PREV
17
రెండో భారతీయుడుగా చరిత్రలో

పలు వాయిదాల అనంతరం భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా రోదసీ ప్రయాణం జూన్ 25 (బుధవారం) ప్రారంభం కాబోతోంది. ఆయన యాక్సియమ్ మిషన్ 4 (Ax-4) ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వైపు పయనించబోతున్నారు. ఈ ప్రయాణం ద్వారా శుభాంశు శుక్లా, రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న రెండో భారతీయుడుగా చరిత్రలో నిలవబోతున్నారు.

27
1984లో మొదటి ప్రయాణం...

ఇప్పుడు రెండోసారి మునుపటివారి సంగతుల విషయానికి వస్తే, 1984లో రాకేష్ శర్మ రష్యా వ్యోమనౌకలో ప్రయాణించి అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా పేరున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు, దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత, మరో భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లబోతుండడం విశేషం. ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

37
కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి Ax-4 ప్రయాణం

శుక్లా ప్రయాణం అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నడీ స్పేస్ సెంటర్లోని 39A లాంచ్ ప్యాడ్ నుంచి ప్రారంభమవుతుంది. ఇది అంతరిక్ష చరిత్రలో ఓ ప్రత్యేకత కలిగిన ప్రదేశం. ఎందుకంటే 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అపోలో 11 మిషన్ ప్రయాణం కూడా ఇక్కడి నుంచే జరిగింది.

ఈ ప్రయాణం కోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ ఫాల్కన్ 9 రాకెట్ను ఉపయోగిస్తున్నారు. అమెరికా తూర్పు కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01 గంటలకు రాకెట్ లాంచ్ అవుతుంది. వాతావరణ పరిస్థితులు 90% అనుకూలంగా ఉన్నట్టు స్పేస్‌ఎక్స్ తెలిపింది.

47
ISRO ఆధ్వర్యంలో శుక్లా ఎంపిక

 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శుభాంశు శుక్లాను ఈ మిషన్‌కు ప్రధాన వ్యోమగామిగా ఎంపిక చేసింది. ఆయన వయసు 39 సంవత్సరాలు. ప్రయాణానికి ముందు ఆయన ఒక నెల పాటు కఠిన క్వారంటైన్లో ఉన్నారు. అంతేకాదు, ISRO చైర్మన్ నారాయణన్ సూచనలతో రాకెట్‌లో కొన్ని సాంకేతిక లోపాలను NASA గుర్తించింది.

57
15 రోజుల పాటు ISSలో శాస్త్రీయ ప్రయోగాలు

 ఈ మిషన్‌లో మొత్తం నలుగురు వ్యోమగాములు పాల్గొంటున్నారు. వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 15 రోజుల పాటు గడిపి 60 శాస్త్రీయ ప్రయోగాలు చేయనున్నారు. అందులో 7 ప్రయోగాలు భారత శాస్త్రవేత్తలు ప్రతిపాదించినవే కావడం గర్వకారణం.

శుక్లా, ISSలో ఉండగానే భూమిపై ఓ ప్రముఖ వ్యక్తితో ప్రత్యక్షంగా సంభాషించనున్నారు. ఇది "స్పేస్ టు ఎర్త్ అవుట్‌రిచ్" కార్యక్రమం కింద నిర్వహించబడుతుంది.

ప్రస్తుతం ISSలో ఇప్పటికే ఉన్న 7 అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి Ax-4 బృందం పనిచేస్తుంది.

67
వాయిదాల వెనుక కారణాలు

ఈ మిషన్‌ను మొదట మే 29న లాంచ్ చేయాలని భావించారు. అయితే వాతావరణ పరిస్థితులు, ఆక్సిడైజర్ లీక్, సాంకేతిక లోపాల కారణంగా అనేకసార్లు వాయిదా పడింది. చివరికి అన్ని సమస్యలను అధిగమించి జూన్ 25న ప్రయోగం ప్రారంభం కాబోతోంది.

మిషన్ నిర్వహణ, భారత్-అమెరికా ఒప్పందం ఈ మిషన్‌ను అమెరికాలోని హ్యూస్టన్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ "యాక్సియమ్ స్పేస్" నిర్వహిస్తోంది. ఇది NASA-ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన నాల్గో మిషన్.

ఈ మిషన్ ప్రధాని మోదీ 2023లో అమెరికా పర్యటనలో అధ్యక్షుడు జో బైడెన్‌తో కుదిరిన ఒప్పందం ద్వారా ముందుకు వచ్చింది. దీనివల్ల ISRO-NASA భాగస్వామ్యంలో ఒక భారత వ్యోమగామిని అంతరిక్షానికి పంపించే ప్రణాళిక అమలైంది. ఈ కార్యక్రమాన్ని కొన్ని వర్గాలు "మిషన్ ఆకాశగంగ" (Mission Akash Ganga) అని కూడా పిలుస్తున్నాయి.

77
శుభాంశు శుక్లా ప్రయాణం

దేశ గర్వంగా అంతరిక్ష ప్రయాణాల్లో భారత్ అంతర్జాతీయంగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో, శుభాంశు శుక్లా లాంటి వ్యోమగాముల సాహసంతో భారత యువతకు ప్రేరణ కలుగనుంది. చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే ఈ మిషన్ దేశానికి గర్వకారణం.

Read more Photos on
click me!

Recommended Stories