ఈ అధ్యయనం ప్రకారం ప్రతి పదిమందిలో నలుగురు భారతీయులు సహోద్యోగితో డేటింగ్ చేస్తున్నారు. దీన్నిబట్టి పని ప్రదేశాలలో ప్రేమాయణాలు సాధారణంగా మారిపోయాయని అర్థమవుతోంది. నిజానికి ఆఫీసుల్లో వృత్తిపరమైన సరిహద్దులు, ప్రవర్తన వంటి వాటికీ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వాటన్నింటిని దాటుకొని మరి ఆఫీస్ రొమాన్స్ విపరీతంగా పెరిగిపోయింది. మెక్సికోలో 43 శాతం మంది ఉద్యోగులు తమ సహోద్యోగితో ప్రేమలో ఉన్నామని చెబితే.. ఇక భారతదేశంలో 40 శాతం మంది ప్రేమలో ఉన్నట్టు చెప్పారు. ఇక అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో 30 శాతం మంది సహోద్యోగితో డేటింగ్ చేస్తున్నట్టు వివరించారు.