ముఖేష్ అంబానీ కూడా సాలరీ తీసుకుంటారా..! ఎంతో తెలుసా..?

First Published | Aug 8, 2024, 1:14 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా సాధారణ ఉద్యోగిలాగే సాలరీ తీసుకుంటారని మీకు తెలుసా..? ఇలా ఆయన తీసుకునే జీతం ఎంతంటే... 

Mukesh Ambani

ప్రపంచంలోని టాప్ ధనవంతుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఒకరు. కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయని అంటారు... కానీ ఇది అంబానీ కుటుంబానికి వర్తించారు. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోనన్ని ఆస్తులను ముఖేష్ అంబానీ కూడబెట్టారు. ఇటీవల ఆయన చిన్నకొడుకు అనంత్ అంబానీ పెళ్లివేడుకను చూస్తేనే ముఖేష్ ఏ స్థాయిలో సంపాదిస్తారో అర్థమవుతుంది. 
 

Mukesh Ambani

ముఖేష్ అంబానీకి దేశవిదేశాల్లో అనేక వ్యాపారాలున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ గా ఈ వ్యాపార వ్యవహారాలను ఆయనే చూసుకుంటారు. ఇందుకోసం ఆయనకు రిలయన్స్ సంస్థ సాలరీని కూడా అందిస్తుంది. ఇలా తన కంపనీ నుండి తానే సాలరీ తీసుకుంటారు ముఖేష్ అంబానీ. తాజాగా ఆయన జీతం వార్తల్లో నిలిచింది. 


Mukesh Ambani

వరుసగా నాలుగో ఏడాది కూడా తన జీతం తీసుకోలేదు ముఖేష్ అంబానీ. కరోనా కష్టకాలంలో తన జీతాన్ని త్యాగం చేసారు అంబానీ. ఇలా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ముఖేష్ అంబానీ తీసుకోలేదు. అప్పటినుండి ఇప్పటివరకు అంటే నాలుగు సంవత్సరాలుగా ఆయన సాలరీ తీసుకోకుండానే పని చేస్తున్నారు.  

Mukesh Ambani

ఈ సందర్భంగా ప్రపంచ కుభేరుడు... రిలయన్స్ సంస్థ కూడా ఆయనదే. ఇలా తన సంస్థను సక్సెస్ ఫుల్ గా నడుపుతున్న ముఖేష్ అంబానీ సాలరీ ఎంతుంటుంది..? అనేది ఆసక్తికరం. అంబానీల ఇంట పనిచేసేవారు,డ్రైవర్లకే లక్షల్లో జీతాలు వుంటాయని విన్నాం. అలాంటిది ముఖేష్ అంబానీకి సాలరీ ఎంతో తెలుసుకుందాం. 

Mukesh Ambani

ముఖేష్ అంబానీ సాలరీ ఎంత? 

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ గా 1977 లో బాధ్యతలు చేపట్టారు ముఖేష్ అంబానీ. తండ్రి నుండి బాధ్యతలను తీసుకున్నాక ముఖేష్ విజయవంతంగా రిలయన్స్ సంస్థను నడిపారు. సంస్థ బాధ్యతలు చూస్తున్నందుకు గాను ఆయన ప్రతిఏటా కొంత సాలరీ తీసుకునేవారు. ఇలా 2007 నుండి 2020 వరకు ఆయన ఏడాదికి రూ.15 కోట్లను తీసుకునేవారు. ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దని ఆయన నిర్ణయించుకున్నారు.  

Mukesh Ambani

అయితే 2020 లో కరోనానా వ్యాప్తితో వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్న నేపథ్యంలో తన సాలరీని కూడా త్యాగం చేసారు ముఖేష్. అలవెన్సులు, కమీషన్లు, రిటైర్మెంట్ ప్రయోజనాలు...ఇలా ఉద్యోగులకు వుండే  ఇతర ఆర్థిక చెల్లింపులను కూడా వదులుకున్నారు. అయితే వ్యాపార కార్యకలాపాల కోసం ఆయన చేసే ప్రయాణాలు, లాడ్జింగ్, సెక్యూరిటీ ఖర్చులను కూడా రిలయన్స్ సంస్థ భరిస్తుంది. 
 

Latest Videos

click me!