గత వరల్డ్‌ కప్‌ నుంచి ఈ వరల్డ్‌ కప్‌ వరకు మనకేం జరిగింది..? మీ జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయో తెలుసా..?

First Published Jul 4, 2024, 12:08 PM IST

ఐసీసీ T20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా భారత్ నిలిచింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమిండియా ట్రోఫీని సొంతం చేసుకోవడంతో దేశమంతా సంబరాలు చేసుకుంది. మరి ఈ 17 ఏళ్లలో మన జీవితంలో, అలాగే దేశంలో ఎన్ని మార్పులు జరిగాయో తెలుసా...?    

how India has transformed between the two World Cup victories

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024ను మనం గెలిచేశాం. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రోహిత సేన పొట్టి కప్‌ను సొంతం చేసుకొని.. భారత్‌కు విజయాన్ని అందించారు. ప్రపంచ కప్‌ గెలుచుకున్న అనంతరం టూర్‌ పూర్తిచేసుకున్న టీమిండియా సభ్యులు స్వదేశానికి కూడా తిరిగి వచ్చేశారు. ఐసీసీ ట్రోఫీతో సొంత గడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్ల మనవాళ్లు అదిరిపోయే రేంజ్‌లో స్వాగతం పలికారు. 

how India has transformed between the two World Cup victories

ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ ఓ ఆసక్తికర పోస్టును షేర్‌ చేశారు. గత వరల్డ్‌ కప్‌ నుంచి ఈ వరల్డ్‌ కప్‌ వరకు మన జీవితంలో జరిగిన మార్పులను వివరించారు. రెండు ప్రపంచ కప్ విజయాల మధ్య, ఆర్థిక వృద్ధి నుంచి సాంకేతిక పురోగతి వరకు.. అంతకు మించి భారతదేశం ఎలా ట్రాన్స్‌ఫామ్‌ అయిందో చూడండి అంటూ పోస్ట్‌ చేశారు.
భారత్‌లో 2007లో 14 కోట్ల కంటే తక్కువ గ్యాస్‌ కనెక్షన్స్ ఉంటే.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 32.42 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. 

Latest Videos


how India has transformed between the two World Cup victories

ఇండియన్‌ ఎకానమీ గత వరల్డ్‌ కప్‌ సమయానికి 1.7 ట్రిలియన్‌ డాలర్లుగా ఉండేది. ప్రస్తుతం గణనీయమైన వృద్ధి సాధించి... భారత ఆర్థిక వ్యవస్థ 3.84 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. కాగా, భారత ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. 
2027 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుందని కేంద్ర వర్గాలు తెలిపాయి.

how India has transformed between the two World Cup victories

దేశీయ స్టాక్ మార్కెట్‌లోనూ గడిచిన కొన్నేళ్లు లాభాలు నమోదయ్యాయి. సెన్సెక్స్ ఈ ఏడాది (2024) తొలిసారి 79వేల మార్కును అధిగమించింది. కాగా, 2007లో సెన్సెక్స్ 19000 పాయింట్లుగా ఉండేది.

how India has transformed between the two World Cup victories

కేంద్ర బడ్జెట్‌లోనూ గడిచిన కొన్నేళ్లలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. 2007లో భారత కేంద్ర బడ్జెట్‌ దాదాపు రూ.12.5 లక్షల కోట్లు ఉండగా... ప్రస్తుతం బడ్జెట్‌ రూ.45 లక్షల కోట్లకు చేరింది. 
 

how India has transformed between the two World Cup victories

భారత్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో ప్రజల ఆదాయం సైతం వృద్ధి చెందింది. దీంతో భారతదేశ తలసరి ఆదాయం కూడా పెరింది. 2007లో తలసరి ఆదాయం రూ.60,603 ఉంటే 2024 నాటికి రూ.1.72లక్షలకు చేరింది.

how India has transformed between the two World Cup victories

భారత్ ఇంటర్నెట్‌ వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. 2007లో దేశ వ్యాప్తంగా 10 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా... ఆ సంఖ్య 2024 నాటికి 88.1 కోట్లకు చేరింది. కాగా, 2025 నాటికి భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90కోట్లకు చేరుతుందని అంచనా.

how India has transformed between the two World Cup victories

స్మార్ట్‌ ఫోన్ల వినియోగంలోనే కాదు.. తయారీ, ఎగుమతిలోనూ భారత్‌ భారీ వృద్ధి సాధించింది. 2007లో భారత్‌ నుంచి 1.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఫోన్లు ఎగుమతి అయ్యేవి. ఈ ఏడాది దేశం నుంచి 14.38 బిలియన్‌ డాలర్ల విలువైన ఫోన్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. తాజా లెక్కల ప్రకారం 15.6 బిలియన్‌ డాలర్ల విలువైన ఫోన్ల ఎగుమతితో భారతదేశం నాలుగో అతిపెద్ద దేశంగా అవతరించింది. 

how India has transformed between the two World Cup victories

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో దేశ వ్యాప్తంగా విరివిగా స్టార్టప్‌ కంపెనీలు వెలుస్తున్నాయి. గడిచిన కొన్నేళ్లలో ప్రారంభమైన అంకుర సంస్థలు గణనీయమైన వృద్ధిని సైతం సాధించాయి. 1 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన సంస్థలు (యూనికర్న్‌లు) భారత్‌లో ప్రస్తుతం 114 ఉన్నాయి. 17 సంవత్సరాల క్రితం దేశంలో యూనికార్న్‌ల సంఖ్య 0.

click me!