HMPV నిర్ధారణకు చేసే టెస్ట్ ఏమిటి? దీనికి ఎంత ఖర్చు‌ అవుతుంది?

First Published | Jan 8, 2025, 4:34 PM IST

చైనా నుండి మెళ్లిగా విదేశాలకు పాకుతున్న HMPV వైరస్ భారత్ కు చేరింది. ఇప్పటికే మన దేశంలో ఒక్కోటిగా కేసులు బైటపడుతున్నాయి. ఈ క్రమంలో వైరస్ లక్షణాలు కనిపిస్తే ఏ టెస్టులు చేసుకోవాలో తెలుసుకుందాం. 

HMPV

భారతదేశంలో హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV) గత రెండ్రోజులు వెలుగుచూస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో మొదలైన కేసులు ఇతర రాష్ట్రాల్లో కూడా వెలుగుచూస్తున్నాయి. చెన్నై, అహ్మదాబాద్, నాగ్ పూర్ లలో hmpv కేసులు నమోదయ్యాయి, ఇలా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య ఏడుకు చేరుకుంది.  

రోజురోజుకు HMPV కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలయ్యింది. అయితే ఈ వైరస్ కరోనా మాదిరిగా ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదు... కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా ప్రజల్లో భయం మాత్రం తగ్గడంలేదు. 

HMPV

హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV) అంటే ఏమిటి?

HMPV అనేది ఒక సాధారణ శ్వాసకోశ వైరస్. ఇది ప్రధానంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కుకారటం వంటి లక్షణాలకు కారణమవుతుంది. ఇవి సాధారణంగా శీతాకాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలే...  కాబట్టి పెద్దగా ఆందోళన వద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సంపూర్ణ ఆరోగ్యవంతులకు ఈ వైరస్ సోకినా తగినంత విశ్రాంతి తీసుకుంటే చాలు... నాలుగైదు రోజులు కోలుకుంటారు. అయితే ఈ HMPV వైరస్ శిశువులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి కాస్త ప్రమాదకరం... ఇప్పటికే  అనారోగ్యంతో వున్నవారు దీని బారినపడితే మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ఇలాంటివారు HMPV పట్ల కాస్త జాగ్రత్తగా వుంటే సరిపోతుంది. 


HMPV

HMPV నిర్దారణకు చేసే వైద్యపరీక్షలు ఏమిటి? ఎంత ఖర్చవుతుంది?:

HMPV లక్షణాలతో బాధపడేవారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచింది. ఎందుకంటే ఈ వైరస్ నిర్ధారణ అయితే ఆరోగ్యం క్షీణించకుండా జాగ్రత్త పడవచ్చు. ఇలా HMPV నిర్ణారణకు బయోఫైర్ ప్యానెల్ వంటి అధునాతన డయాగ్నస్టిక్ పద్ధతులు వాడుతున్నారు. భారతదేశంలో అనేక ప్రైవేట్ ల్యాబ్‌లు ఈ పరీక్షను అందిస్తున్నప్పటికీ, ఖర్చులు గణనీయంగా ఉండవచ్చు.

సాధారణ హ్యూమన్ మెటాన్యూమోవైరస్ RT PCR పరీక్ష డాక్టర్ లాల్ పాత్‌లాబ్స్, టాటా 1mg ల్యాబ్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్ ల్యాబ్ వంటి ప్రముఖ ల్యాబ్‌లలో రూ. 3,000 నుండి రూ. 8,000 వరకు ఉండవచ్చు. HMPV, అడినోవైరస్, కరోనావైరస్ 229E, కరోనావైరస్ HKU1లను కలిగి ఉన్న మరింత సమగ్రమైన పరీక్ష కోసం మొత్తం ఖర్చు రూ. 20,000 వరకు ఉండవచ్చు 

HMPV

HMPV లక్షణాలు, ప్రమాదాలు:

ఆరోగ్యవంతులైన వ్యక్తులలో HMPV సాధారణంగా గొంతు నొప్పి, ముక్కు కారటం, దగ్గు, తక్కువ జ్వరం వంటి సామాన్య లక్షణాలకు కారణమవుతుంది. అయితే వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు ఇది హాని కలిగించవచ్చు.  వీరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియా వంటి మరింత తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.

చిన్నారుల్లో లక్షణాలు మరింత తీవ్రంగా ఉండవచ్చు, శ్వాస తీసుకోవడంలో ఎక్కువ శబ్దం, వేగంగా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. సైనోసిస్ లేదా పెదవులు లేదా వేళ్లు నీలిరంగులోకి మారడం మరింత తీవ్రమైన సందర్భాలలో   కనిపించవచ్చు.

HMPV చికిత్స మరియు నిర్వహణ:

HMPV చికిత్స :

ప్రస్తుతం, HMPV చికిత్సకు ప్రత్యేకమైన యాంటీవైరల్ మందులు లేవు. స్వల్ప లక్షణాలు ఉన్నవారు విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఇంటివద్దే పరిస్థితిని మెరుగుపర్చుకోవచ్చు.  అయితే లక్షణాలు తీవ్రమైతే, సమస్యలను నివారించడానికి ఆసుపత్రిలో చేరడం అవసరం కావచ్చు.

హాస్పిటల్లో చేరితే చేసే అందించే వైద్యం :

ఆక్సిజన్ థెరపీ: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా వుంటే బయటనుండి ఆక్సిజన్ అందిస్తారు.   
ఇంట్రావీనస్ ద్రవాలు: హైడ్రేషన్‌ను నిర్వహించడానికి IV ద్రవాలు ఇవ్వబడతాయి.
కార్టికోస్టెరాయిడ్స్: వాపును తగ్గించడానికి, శ్వాసకోశ లక్షణాలను తగ్గించడానికి స్టెరాయిడ్స్ సూచించబడతాయి.

ఇవి కూడా చదవండి :

మీరు HMPV బారిన పడకుండా వుండాలంటే ... ఏం చేయాలి, ఏం చేయకూడదు

ఇండియాలో తొలి HMPV కేసు .. 8 నెలల శిశువుకు పాజిటివ్ : ఇక కరోనా సీన్ రిపీట్ కావాల్సిందేనా?

వేగంగా పెరుగుతున్న HMPV కేసులు: మళ్లీ లాక్‌డౌన్ చేస్తారా?

Latest Videos

click me!