అసలు నిజమిదీ :
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు గోవాలో పర్యాటక రంగం దెబ్బతినడం కాదు మరింత పెరుగుతోందని తాజా డాటా చెబుతోంది. ఇటీవల క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా గోవాకు పర్యాటకులు పోటెత్తారట. దీంతో బీచ్ లు, వీధులు సందర్శకులతో నిండిపోయాయని... రికార్డ్ స్థాయిలో ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.
గోవా పర్యాటక రంగం 2024 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ఏకంగా రూ.4,614 కోట్లను ఆర్జించింది. 2023 లో పోలిస్తే ఇది రూ.365 కోట్లు ఎక్కువ. జిఎస్టి ఆదాయంలో 9.62 శాతం, వ్యాట్ వసూళ్లలో 6.41 శాతం పెరుగుదల కనిపించింది.దీన్నిబట్టే గోవాలో పర్యాటకం ఎలా అభివృద్ది చెందుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ డాటా గోవాకు వెళ్లే పర్యాటకుల సంఖ్య తగ్గిందన్న ప్రచారం తప్పని నిరూపిస్తోంది. గోవాలోని కేరిమ్, కెనకోనా, అంజునా,కలంగుటే వంటి బీచుల్లో పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేవలం బ్యాచిలర్స్ మాత్రమే కాదు కుటుంబాలతో కలిసి వచ్చి గోవాలో సరదగా గడిపేవారి సంఖ్య పెరుగుతోంది. వాటర్ గేమ్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ను పిల్లలు, పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక గోవా వీధుల్లో షాపింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.