హృదయవిదారకం : భర్తకు నోటితో శ్వాస అందించిన భార్య.. చివరకు...

First Published | Apr 26, 2021, 4:11 PM IST

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఓ వైపు వైరస్, మరోవైపు ఆక్సీజన్ కొరత, ఇంకోవైపు హాస్పిటల్స్ లో బెడ్లు దొరకకపోవడం.. దీంతో కరోనా వచ్చిన వారి పరిస్థితి భయంకరంగా తయారయ్యింది. 

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఓ వైపు వైరస్, మరోవైపు ఆక్సీజన్ కొరత, ఇంకోవైపు హాస్పిటల్స్ లో బెడ్లు దొరకకపోవడం.. దీంతో కరోనా వచ్చిన వారి పరిస్థితి భయంకరంగా తయారయ్యింది.
undefined
ఈ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ వినియోగం భారీగా పెరిగింది. కానీ అవసరానికి సరిపడా ప్రాణవాయువు నిల్వలు లేక చాలా మంది మరణిస్తున్నారు. ఆస్పత్రిలో బెడ్ల సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజెప్పే ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది .
undefined

Latest Videos


కరోనా బారిన పడిన ఓ భర్త శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ లేవని చేర్చుకోలేదు. ఈ లోపు బాధితుడి పరిస్థితి విషమించ సాగింది. దాంతో ప్రమాదం అని తెలిసి కూడా భార్య తన నోటి ద్వారా భర్తకు శ్వాస అందించే ప్రయత్నం చేసింది.
undefined
అయితే ఆమె ప్రయత్నం వృధా అయింది. చివరికి ఆ వ్యక్తి భార్య ఒడిలోనే కన్నుమూశాడు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
undefined
ఆగ్రా సెక్టార్ 7కు చెందిన రవి సింఘాల్‌ కరోనా బారిన పడ్డాడు. దాంతో అతడి భార్య రేణు సింఘాల్‌, రవి సింఘాల్‌ ను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళింది. కానీ బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో అతడిని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి సిబ్బంది నిరాకరించారు.
undefined
ఈలోపు రవి సింఘాల్‌ కి ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తింది. దాంతో అతడి సరోజినీ నాయుడు మెడికల్ కాలేజ్ కి తీసుకెళ్లేందుకు సిద్ధమయింది రేణు సింఘాల్‌. ఆటోలో ఎక్కి ఆస్పత్రికి వెళుతుండగా అతడి పరిస్థితి చేయి దాటి పోసాగింది. ఊపిరి తీసుకోడానికి చాలా కష్టపడి సాగాడు.
undefined
దాంతో ప్రమాదం అని తెలిసి కూడా రేణు సింఘాల్‌ అతడికి నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేసింది. కానీ అవేవీ ఫలించలేదు. ఆస్పత్రికి చేరుకునే లోగానే అతడు ఆటోలోనే భార్య ఒడిలో కన్నుమూశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తనకు ప్రమాదం అని తెలిసి కూడా రేణు సింఘాల్‌ చేసిన సాహసం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఆమె భర్త బతికి ఉంటే బాగుండు అని వాపోతున్నారు.
undefined
ఇక ఆగ్రాలో చాలా ఆస్పత్రిలో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఆక్సిజన్ నిల్వలు అయిపోవడంతో పలువురు మరణించారు. ఈ పరిస్థితులపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలకు ప్రజల కష్టాలు పట్టవా అని విమర్శిస్తున్నారు. ఇక దేశంలో సోమవారం మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 2812 మంది కోడి పేషెంట్లు మృతి చెందారు.
undefined
click me!