ఢిల్లీ ఆస్పత్రుల్లో తీవ్ర ఆక్సీజన్ కొరత.. జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ లో 20 మంది రోగులు మృతి... !

First Published Apr 24, 2021, 2:00 PM IST

తీవ్రమైన ఆక్సిజన్ కొరతతో ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ లో ఒక్కరాత్రిలో కనీసం ఇరవై మంది రోగులు మృత్యువాత పడ్డారు. దీనిమీద జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ డి కె బలూజా మాట్లాడుతూ ఆక్సీజన్ కొరత తీవ్రంగా ఉందని, దీనిమీద ఉదయం నుంచి పోరాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

undefined
ప్రస్తుతం ఆసుపత్రిలో 200 మందికి పైగా రోగులు ఉన్నారని, ఉదయం 10:45 గంటలకు వారికి అరగంట ఆక్సిజన్ మాత్రమే ఉందని బలూజా చెప్పారు. అనేక గంటల ఎదురుచూపుల తరువాత అర్థరాత్రికి గానీ ఆక్సీజన్ రీఫిల్ కాలేదని ఇదే నష్టానికి దారి తీసిందని తెలిపారు.
undefined
డాక్టర్ డి కె బలూజా ఈ విషయాన్ని ప్రభుత్వానికి, మీడియాకు తెలిపాడు. హాస్పిటల్ లో ఆక్సీజన్ నిలువలు నిండుకున్నాయని.. దాదాపు 200మంది పేషంట్లు ఆక్సీజన్ అవసరం ఉందని, ఇప్పటికే ఆక్సీజన్ కొరతతో 20మంది మృత్యువాత పడ్డారని తెలిపారు.
undefined
ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఆస్పత్రికి ఏదైనా సహాయం అందిందా అని అడిగినప్పుడు డాక్టర్ బలూజా స్పందిస్తూ.. ‘ఎవరూ, ఏమీ హామీ ఇవ్వలేదు. అందరూ మా వంతు కృషి చేస్తామని చెబుతున్నారు"అన్నారు.
undefined
ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఆస్పత్రికి ఏదైనా సహాయం అందిందా అని అడిగినప్పుడు డాక్టర్ బలూజా స్పందిస్తూ.. ‘ఎవరూ, ఏమీ హామీ ఇవ్వలేదు. అందరూ మా వంతు కృషి చేస్తామని చెబుతున్నారు"అన్నారు.
undefined
ఆసుపత్రిలో 200 మందికి పైగా రోగులు ఉన్నారని, వారిలో 80 శాతం మంది ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్నారని డాక్టర్ బలూజా తెలిపారు. సుమారు 35 మంది రోగులు ఐసియులో ఉన్నారని ఆయన చెప్పారు.
undefined
రాజధానిలోని అనేక ఆసుపత్రులు శనివారం ఉదయం SOS కాల్స్ పంపుతూ, ఆక్సిజన్ ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. మూల్‌చంద్ హాస్పిటల్, సర్ గంగా రామ్ హాస్పిటల్ (ఎస్‌జిఆర్‌హెచ్), బాత్రా హాస్పిటల్, జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ ఆక్సిజన్ కొరత ఉందని వీలైనంత త్వరగా ఆక్సీజన్ ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశాయి.
undefined
శనివారం ఉదయం 7.05 గంటలకు, మూల్‌చంద్ హాస్పిటల్ ఆక్సిజన్ కొరత గురించి ట్వీట్ చేసింది. "అర్జెంట్ SOS సహాయం. మూల్‌చంద్ హాస్పిటల్‌లో 2 గంటల కన్నా తక్కువ ఆక్సిజన్ సరఫరా ఉంది. అన్ని నోడల్ ఆఫీసర్ నంబర్‌లకూ ప్రయత్నించి నిరాశకు గురయ్యాం. 135 మందికి పైగా కోవిడ్ రోగులు లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారు" అని మూల్‌చంద్ హాస్పిటల్ ప్రధానమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ముఖ్యమంత్రి కార్యాలయం, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ లను టాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.
undefined
ఆ తరువాత ఉదయం 9.20 గంటలకు, SGRH ట్వీట్ చేసింది.. తమ దగ్గర కేవలం 500 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ మాత్రమే ఆసుపత్రిలో మిగిలి ఉందని, ఇది సుమారు 30 నిమిషాల పాటు మాత్రమే వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక బాత్రా హాస్పిటల్ కూడా ఆక్సిజన్ కొరతను చెప్పుకొచ్చింది. దాని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్సీఎల్ గుప్తా మాట్లాడుతూ 350 మంది రోగులకు ఆసుపత్రిలో ఒక గంట పాటు ఆక్సిజన్ ఉంది. ఆ తరువాత అత్యవసరం పరిస్థితే.. నిరంతర ఆక్సిజన్ సరఫరా ఉండేలా చూడాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆ క్రమంలో, బాత్రా ఆసుపత్రికి ఆక్సిజన్ ట్యాంకర్ ఏర్పాటు చేసినట్లు డిసిపి సౌత్ డిస్ట్రిక్ట్ అతుల్ భాటియా తెలిపారు.

"దాదాపు 12 గంటల అభ్యర్ధన తరువాత మాకు కేవలం 500 లీటర్ల ఆక్సిజన్ మాత్రమే అందింది. మాకు రోజువారీ 8,000 లీటర్ల ఆక్సీజన్ అవసరం పడుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో 350 మంది రోగులు ఉన్నారు. తగినంత ఆక్సీజన్ సరఫరా లేకపోతే వారికి చికిత్స అందించడం కష్టం" అని గుప్తా చెప్పారు.
undefined
click me!