Yearender 2023: Google లోని టాప్-10 స్టార్స్ వీరే..

First Published | Dec 12, 2023, 12:16 PM IST

Google Year in Search 2023: భారత్ లో గూగుల్ లో ఎక్కువమంది బాలీవుడ్ సెలెబ్రిటీలు, క్రికెటర్లు, యూట్యూబర్ల గురించి వెతుకుతున్నారు. ఇక 2023లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్య‌క్తుల జాబితాలో టాప్ లో సినీ స్టార్ తో పాటు ఎక్కువ‌గా క్రికెట్ ప్లేయ‌ర్లు ఉన్నారు.
 

Kiara Advani, Shubman Gill

Most searched people on Google in India in 2023: ఇండియాలో గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తులు 2023 జాబితాను గూగుల్ ప్ర‌క‌టించింది. ఈ ఏడాది అతిపెద్ద ఆన్లైన్ బజ్! పొలిటికల్ ఐకాన్స్, స్పోర్ట్స్ నుంచి ఎంటర్టైనర్ల వరకు 2023 సంవత్సరానికి ఇండియాలో గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 వ్యక్తులలో కియారా అద్వానీ టాప్ లో ఉన్నారు. 

భారత్ లో గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2023లో టాప్ వ్య‌క్తులు వీరే.. 
 

Kiara Advani

1. కియారా అద్వానీ

బాలీవుడ్ లో స్టార్ యాక్ట‌ర్. కబీర్ సింగ్, షేర్షా, జుగ్ జగ్ జీయో వంటి పలు సూప‌ర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులులోనూ ప‌లు సినిమాల్లో న‌టించారు.ఆమె అందం, ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ది. మహిళా సాధికారత కోసం కూడా కృషి చేస్తున్నారు.  బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను 2023 ఫిబ్రవరి 7న కియారా వివాహం చేసుకున్నారు.
 


Shubman Gill

2. శుభ్‌మన్ గిల్

1999 లో జన్మించిన భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తన స్టైల్ స్ట్రోక్ ప్లే తో స్టార్ ప్లేయ‌ర్ గా ఎదిగాడు. ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ టీమ్ లో కీ ప్లేయ‌ర్. ప్రతిభావంతుడైన ఓపెనింగ్ బ్యాట్స్మన్. అండర్-19 వరల్డ్ కప్ లో తన ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇది బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీతో త‌ర్వాత భార‌త్ నుంచి వ‌స్తున్న స్టార్ క్రికెట్ గా గుర్తింపు సంపాదించాడు. 
 

Rachin Ravindra

3. రచిన్ రవీంద్ర

కివీస్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్ర మంచి ఆల్ రౌండర్. ఇటీవ‌ల ముగిసిన ఐసీసీ వరల్డ్ కప్ అరంగేట్రంలోనే సెంచరీతో స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ గా చ‌రిత్ర సృష్టించాడు. అలాగే, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ తో అద‌ర‌గొట్టాడు. మెరుగైన ప్రతిభ, సామర్థ్యం అతన్ని న్యూజిలాండ్ క్రికెట్ కు భవిష్యత్ స్టార్ గా నిలబెట్టాయి.
 

Mohammed Shami

4. మహ్మద్ షమీ

భారత క్రికెట్ ప్రధాన పేస్ బౌలర్ మహ్మద్ షమీ స్వింగ్, సీమ్ మాస్టర్. ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. యార్కర్లు, రివర్స్ స్వింగ్ బౌలింగ్ చేయగల సామర్థ్యం షమీని తన తరం అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలిపింది. భారత బౌలింగ్ విభాగంలో కీల‌క‌మైన ఆట‌గాడు.
 

Elvish Yadav

5. ఎల్వీష్ యాదవ్

హాస్యభరితమైన, వ్యంగ్య కంటెంట్ తో ప్రసిద్ధి చెందిన యువ భారతీయ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్. లక్షలాది మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుని రియాలిటీ టీవీలోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ షో ఓటీటీ 2 విజేతగా నిలిచాడు. అయితే, కొన్ని అనుచిత జోకులు, బాడీ షేమింగ్ వివాదాలు చుట్టుముట్టినా అత‌ని పాపులారిటీ త‌గ్గ‌లేదు.
 

Sidharth Malhotra

6. సిద్ధార్థ్ మల్హోత్రా

ప్రముఖ భారతీయ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" చిత్రంలో న‌టించి పాపులారిటీ సంపాదించాడు. బహుముఖ నటనకు ప్రసిద్ది చెందిన సిద్ధార్థ్ మ‌ల్హోత్రా.. బాలీవుడ్ న‌టుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. "కపూర్ అండ్ సన్స్", "షేర్షాహ్", "ఇత్తెఫాక్" చిత్రాలలో వైవిధ్యమైన నటనతో మెప్పించారు. చిత్ర నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో కియారా అద్వానీని వివాహం చేసుకున్న ఆయన భారతీయ సినిమాల్లో పాపులర్ పర్సన్ గా కొనసాగుతున్నారు.
 

Glenn Maxwell

7. గ్లెన్ మ్యాక్స్ వెల్

క్రికెట్ ప్ర‌పంచంలో గ్లెన్ మ్యాక్స్ వెల్ పేరు తెలియ‌ని వారుండ‌రు. త‌న ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ స్టార్ క్రికెట్ ప్లేయ‌ర్ గా పేరు సంపాదించాడు. ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ బహుముఖ ప్రజ్ఞాశాలి బ్యాట్స్ మన్, బౌలర్. అద్భుత‌మైన షాట్లు, అథ్లెటిక్ ఫీల్డింగ్ తో గ్రౌండ్ లో అద‌ర‌గొట్టాడు. కంగారుల త‌ర‌ఫున ఆడిన అంత‌ర్జాతీయ మ్యాచ్ ల‌లోనే కాకుండా ఐపీఎల్, బిగ్ బాష్ వంటి లీగ్ ల‌లో త‌న ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. 

David Beckham

8. డేవిడ్ బెక్ హామ్

ఫుట్ బాల్ ఐకాన్, గ్లోబల్ బ్రాండ్ స్టార్. తన పిన్పాయింట్ క్రాస్ లు, ఫ్రీ కిక్స్,  ఐకానిక్ నంబర్ 7 జెర్సీకి తో అంత‌ర్జాతీయంగా ప్రసిద్ధి చెందాడు. చాంపియన్స్ లీగ్, ఆరు ప్రీమియర్ లీగ్ టైటిళ్లు, గోల్డెన్ బాల్ గెలుచుకున్నాడు. స్పైస్ గర్ల్ విక్టోరియాను వివాహం చేసుకుని ఫ్యాషన్, సెలబ్రిటీ ఐకాన్ గా మారారు. 2013 లో ఫుట్ బాల్ కు గుడ్ బై చెప్పాడు. 
 

Suryakumar Yadav

9. సూర్యకుమార్ యాదవ్

భార‌త్ స్టార్ క్రికెటర్ గా ఎదుగుతున్న యంగ్ ప్లేయ‌ర్. భార‌త టీ20 జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత్ కు కీలక ఆటగాడిగా మారిన స్టైలిష్, పవర్ఫుల్ బ్యాట్స్ మ‌న్ సూర్యకుమార్ యాదవ్.

Travis Head

10. ట్రావిస్ హెడ్

కంగారుల‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో.. క్రికెట్ అన్ని ఫార్మాట్లలో ఆస్ట్రేలియాకు కీలక బ్యాట‌ర్. దూకుడు స్ట్రోక్ ప్లే, క్లీన్ హిట్టింగ్ కు పేరుగాంచిన హెడ్.. టీ20, వ‌న్డే, టెస్టు క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నాడు. జ‌ట్టులో కీలకమైన ఫీల్డర్, కీ ప్లేయ‌ర్. ఆస్ట్రేలియాలో కు 2023 వ‌ర‌ల్డ్ క‌ప్ అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. 
 

Latest Videos

click me!