Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..

Published : Dec 17, 2025, 10:07 AM IST

Gen z post office: ప్ర‌పంచంలో అతిపెద్ద త‌పాలా వ్య‌వ‌స్థ‌లో ఇండియా పోస్ట్ ఒక‌టి. 1764లో ప్రారంభ‌మైన పోస్ట‌ల్ సేవ‌లు దేశ‌వ్యాప్తంగా ఉన్నాయి. మారిన కాలంతో పాటు పోస్ట‌ల్ సేవ‌లు కూడా మారుతూ వ‌చ్చాయి. కాగా తాజాగా జెన్ జీ పోస్టాఫీసుల‌ను తీసుకొస్తున్నారు. 

PREV
15
జెన్ జీ పోస్టాఫీస్ అంటే ఏంటి?

జెన్ జీ పోస్టాఫీస్ అనేది యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఆధునిక పోస్టాఫీస్. డిజిటల్ సేవలు, ఆకర్షణీయమైన ఇంటీరియర్స్, టెక్నాలజీ ఆధారిత సదుపాయాలు ఈ పోస్టాఫీసుల ప్రత్యేకత. సాధారణ పోస్టాఫీస్‌లకు భిన్నంగా, ఇవి కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐటీలు వంటి క్యాంపస్‌ల్లో ఏర్పాటు చేస్తున్నారు. యువత పోస్టాఫీస్‌లను ఉపయోగించాలనే ఆసక్తి పెంచడమే ప్రధాన లక్ష్యం.

25
వరంగల్ ఎన్ఐటీ క్యాంపస్‌లో జెన్ జీ పోస్టాఫీస్

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి వరంగల్ ఎన్ఐటీ క్యాంపస్‌ హనుమకొండలో జెన్ జీ థీమ్ పోస్టాఫీస్ ప్రారంభమైంది. ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి, హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుమితా అయోధ్య కలిసి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. రంగురంగుల ఇంటీరియర్స్, వైఫై సదుపాయం ఉన్న ఇంటరాక్టివ్ స్పేస్ ఈ పోస్టాఫీస్‌లో ఉన్నాయి.

35
ఈ పోస్టాఫీస్‌లో లభించే సేవలు

ఈ జెన్ జీ పోస్టాఫీస్‌లో పార్సెల్ బుకింగ్, స్పీడ్ పోస్ట్, పోస్టాఫీస్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సేవలు, ఆధార్ నమోదు, క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు స్పీడ్ పోస్ట్‌పై ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు చాలా మంది విద్యార్థులు, సిబ్బంది ఈ సేవలను వినియోగించారు.

45
ఆంధ్రప్రదేశ్, ముంబైలో జెన్ జీ పోస్టాఫీస్‌లు

ఆంధ్రప్రదేశ్‌లో తొలి జెన్ జీ పోస్టాఫీస్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రారంభమైంది. విద్యార్థుల ప్రాజెక్టులు, థీసిస్ పనులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని వీసీ జీపీ రాజశేఖర్ తెలిపారు. ఇదే తరహాలో డిసెంబర్ 18న ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ముంబై నగరంలో తొలి జెన్ జీ పోస్టాఫీస్ ప్రారంభించనున్నారు. అక్కడ ఫ్రీ వైఫై, కేఫెటేరియా స్టైల్ సిట్టింగ్, మినీ లైబ్రరీ, మ్యూజిక్ కార్నర్, స్టాంప్ కలెక్షన్ వస్తువులు అందుబాటులో ఉంటాయి.

55
యువతను ఆకర్షించడమే లక్ష్యం

ఇండియా పోస్ట్ కాలానికి తగ్గట్టు మారుతున్నదనే సంకేతం ఈ జెన్ జీ పోస్టాఫీస్‌లు. యువతకు దగ్గరగా సేవలు అందించడం, పోస్టాఫీస్‌లపై ఉన్న పాత భావనను మార్చడం దీని ఉద్దేశం. ఆధునిక డిజైన్, డిజిటల్ సేవలు, రాయితీలతో ఈ కేంద్రాలు యువతకు కమ్యూనిటీ హబ్‌లా మారనున్నాయి. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంలు, యూనివర్సిటీ క్యాంపస్‌ల్లో ఈ కాన్సెప్ట్‌ను విస్తరించేందుకు ఇండియా పోస్ట్ సిద్ధమవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories