Raebareli: గాంధీ కుటుంబం యూపీని వదిలేసినట్టేనా? కాంగ్రెస్ కంచుకోటల నుంచి బయటికి..!

Published : Feb 14, 2024, 05:04 PM ISTUpdated : Feb 14, 2024, 06:01 PM IST

గాంధీ కుటుంబానికి ఉత్తరప్రదేశ్‌తో రుణం తీరిపోయిందా? 2019 ఎన్నికల్లో అమేథీలో ఓడి వయానాడ్‌లో గెలిచిన రాహుల్ గాంధీ దాదాపు యూపీ నుంచి వచ్చేశారు. తాజాగా, రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ పోటీ చేయకుండా రాజస్తాన్ నుంచి రాజ్యసభలో అడుగు పెడుతున్నారు.  

PREV
16
Raebareli: గాంధీ కుటుంబం యూపీని వదిలేసినట్టేనా? కాంగ్రెస్ కంచుకోటల నుంచి బయటికి..!
Sonia gandhi and Rahul gandhi

కాంగ్రెస్ అగ్రనాయకులు ముఖ్యంగా గాంధీ కుటుంబ సభ్యులు యూపీ నుంచే ఎక్కువగా పోటీ చేసేవారు. యూపీ నుంచే లోక్ సభలో అడుగుపెట్టేవారు. అందుకే రాయ్‌బరేలీ, అమేథీ లోక్ సభ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా కొన్ని దశాబ్దాలపాటు సాగాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. గాంధీ కుటుంబం స్వయంగా ఈ కంచుకోటల నుంచి పోటీ చేయడం లేదు. ఒకదాని తర్వాత మరో సీటును వదిలిపెట్టింది.

26
Sonia gandhi and Rahul gandhi

సోనియా గాంధీ ఈ సారి లోక్ సభ బరిలో నిలబడటం లేదు. ఆమె రాజస్తాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెడుతున్నారు. దీంతో ఆమె రాయ్‌బరేలీ సీటు నుంచి పోటీ చేయడం లేదనేది తేలిపోయింది. ఇక అమేథీ సీటును ఇది వరకే రాహుల్ గాంధీ వదిలిపెట్టారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆయన అమేథీ నుంచి ఓడిపోగా.. సేఫ్‌గా పోటీ చేసిన వయానాడ్‌లో గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు.

36
Sonia gandhi and Rahul gandhi

ఈ రెండు సీట్లకు కాంగ్రెస్‌కు చారిత్రక సంబంధం ఉన్నది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 1952, 1957లలో రాయ్ బరేలీ నుంచి ఫిరోజ్ షా గాంధీ గెలిచారు. ఆ తర్వాత 1977లో జనతా పార్టీ ఒక్క సారి ఈ సీటు గెలుచుకుంది. 1996, 1998లలో బీజేపీ అభ్యర్థి అశోక్ సింగ్ ఇక్కడి నుంచి గెలిచారు. ఈ మూడు సార్లు మినహాయిస్తే అన్ని సార్లు కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది. ఇక్కడి నుంచి ఇందిరా గాంధీ మూడు సార్లు, సోనియా గాంధీ ఐదు సార్లు గెలిచారు.

46
Sonia gandhi and Rahul gandhi

2019లోనూ సోనియా గాంధీ రాయ్‌బరేలీ నుంచి విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. కానీ, ఈ సారి ఆమె పోటీ చేయడం లేదు. గత ఎన్నికల్లో ప్రియాంక గాంధీ యూపీపై ఫోకస్ పెట్టారు. కానీ, ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ సారి కూడా ఆమె ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో స్పష్టత లేదు.

56
Sonia gandhi and Rahul gandhi

ఇక అమేథీ చరిత్ర చూసుకుంటే.. 1967 నుంచి ఇప్పటి వరకు ఈ స్థానం నుంచి ఒక సారి జనతాపార్టీ (1977), 1998లో, 2019(స్మృతి ఇరానీ)లో బీజేపీ గెలిచింది. మిగిలిన అన్నిసార్లు కాంగ్రెస్‌ గెలుచుకుంది. సంజయ్ గాంధీ ఒకసారి, రాజీవ్ గాంధీ నాలుగు సార్లు, సోనియా గాంధీ ఒకసారి, రాహుల్ గాంధీ మూడుసార్లు ఈ సీటు నుంచి గెలిచారు.

66
Sonia gandhi and Rahul gandhi

కాగా, 2019లోనే రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఓడిపోయి తప్పుకున్నట్టయింది. మళ్లీ బహుశా ఆయన వయానాడ్ నుంచే పోటీ చేయవచ్చు. దీంతో ఉత్తరప్రదేశ్‌తో గాంధీ రుణం తీరిపోయిందా? అనే చర్చ జరుగుతున్నది.

Read more Photos on
click me!

Recommended Stories