ఆపరేషన్ థియేటర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్: డాక్టర్ సస్పెన్షన్

First Published | Feb 10, 2024, 8:52 AM IST

రోగులకు శస్త్ర చికిత్స చేయాల్సిన  ఆపరేషన్ థియేటర్  ఫ్రీ వెడ్డింగ్ షూట్ కు వేదికగా మారింది.  ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

ఆపరేషన్ థియేటర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్: డాక్టర్ సస్పెన్షన్

ఆపరేషన్ థియేటర్ ఫ్రీ వెడ్డింగ్ షూట్  నిర్వహించిన డాక్టర్ పై  సస్పెన్షన్ వేటు పడింది.ఈ ఘటన  కర్ణాటక రాష్ట్రంలో  చోటు చేసుకుంది. ఈ ఫోటో షూట్ కు సంబంధించి  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  దరిమిలా ఈ వ్యవహరం వెలుగు చూసింది.  

ఆపరేషన్ థియేటర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్: డాక్టర్ సస్పెన్షన్

కర్ణాటక రాష్ట్రంలోని  చిత్రదుర్గ జిల్లాలోని  భరంసాగర్ లో  ప్రభుత్వ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
ఆపరేషన్ థియేటర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్: డాక్టర్ సస్పెన్షన్

ప్రభుత్వ ఆసుపత్రిలో  కాంట్రాక్టు విధానంలో   ఓ డాక్టర్ పనిచేస్తున్నాడు.  అతనికి ఇటీవలనే వివాహం నిశ్చయమైంది.  దీంతో తన ఫ్రీ వెడ్డింగ్ షూట్ ను  వినూత్నంగా షూట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆపరేషన్ థియేటర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్: డాక్టర్ సస్పెన్షన్

అయితే ఆపరేషన్ థియేటర్ లో మాక్ శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో  అతనికి  కాబోయే  భార్య, ఇతరులు  సహాయం చేస్తున్నట్టుగా ఆ వీడియో ఉన్నట్టుగా  ఉన్నతాధికారులు గుర్తించారని సమాచారం.   ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దరమిలా  జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి  సంబందిత  వైద్య శాఖ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి నోటీసులు పంపారు.

ఆపరేషన్ థియేటర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్: డాక్టర్ సస్పెన్షన్

ఈ విషయం దృష్టికి రావడంతో  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండురావు  స్పందించారు.  సంబంధిత  వైద్యుడిని   డిస్మిస్ చేయాలని ఆదేశించారు.  ప్రభుత్వాసుపత్రులు ప్రజలకు సేవ చేసేందుకు  ఏర్పాటు చేసినవిగా ఆయన చెప్పారు. క్రమశిక్షణరాహిత్యాన్ని సహించబోమని  ఆయన వార్నింగ్ ఇచ్చారు.

ఆపరేషన్ థియేటర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్: డాక్టర్ సస్పెన్షన్

వివాహాలను అత్యంత ఆడంబరంగా చేసుకోనే సంప్రదాయం ఇటీవల కాలంలో ఎక్కువైంది.  వివాహానికి ముందు  ఫ్రీ వెడ్డింగ్ షూట్ లు తీసుకుంటున్నారు. ఫ్రీ వెడ్డింగ్ షూట్ సందర్భంగా  ప్రమాదాలకు గురైన ఘటనలు కూడ అనేకం చోటు చేసుకున్నాయి. 

Latest Videos

click me!