ఉచితంగా గ్యాస్ సిలిండర్లు - మ‌హిళ‌ల‌కు స‌ర్కారు దీపావళి కానుక

First Published | Oct 15, 2024, 11:46 PM IST

Free Cylinder for Diwali: గ్రామీణ, పేద కుటుంబాల కోసం ఎల్పీజీ వంటి స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందుబాటులో ఉంచే లక్ష్యంతో 'ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన' (PMUY) ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింది. ఈ పథకాన్ని 1 మే 2016న యూపీలో ప్ర‌ధాని మోడీ ప్రారంభించారు.
 

Free LPG gas cylinder - PMUY

Free Cylinder for Diwali: దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం వారి వివిధ అవసరాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం కొన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారు. అలాంటి వాటిలో 'ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన' ఒక‌టి. దేశ ప్ర‌జ‌ల‌కు వంట‌గ్యాస్ ను అంద‌రికీ అందుబాటులోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా భార‌త ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చింది. దేశంలోని పేద ప్ర‌జ‌ల ఇండ్ల నుంచి క‌ట్టెల పొయ్యిల‌ను దూరం చేసి స్వ‌చ్ఛ‌మైన ఎల్పీజీ వంటి ఇంధ‌నాన్ని అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చారు. 

Free LPG gas cylinder - PMUY

పీఎంయూవైని యూపీలో ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ 

దేశంలో ఇప్పటికీ కొన్ని చోట్ల మట్టితో చేసిన క‌ట్టెల‌ పొయ్యిలను వంట చేయ‌డానికి వాడుతున్నారు. దీని వ‌ల్ల ఇంట్లో ఎక్కువ‌గా వంట చేసే మ‌హిళ‌ల‌తో పాటు కుటుంబ స‌భ్యుల ఆరోగ్యం దెబ్బ‌తిన‌డంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వంట‌చెరుకు త‌గ్గిపోవ‌డం, అడ‌వుల‌పై ప్ర‌భావం చూపుతున్నాయి. వీటిని ప‌రిష్క‌రించే దిశ‌గా ప్ర‌భుత్వం గ్రామీణ, పేద కుటుంబాల కోసం ఎల్పీజీని వంటి స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందుబాటులో ఉంచే లక్ష్యంతో 'ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన' (PMUY) ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చింది. ఈ పథకాన్ని 1 మే 2016న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బ‌ల్లియాలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌ మోడీ ప్రారంభించారు.


Free LPG gas cylinder - PMUY

ఉచితంగా ఒక‌ గ్యాస్ సిలిండ‌ర్-మ‌హిళ‌ల‌కు దీపావ‌ళి కానుక‌

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ఈ ప‌థ‌కాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు అమ‌లు చేస్తున్నాయి. ప్ర‌జ‌ల‌కు సబ్సిడీపై వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను అందిస్తున్నాయి. అయితే, ఈ దీపావ‌ళికి ఉచితంగా ఒక గ్యాస్ సిలిండ‌ర్ ఇవ్వాల‌ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణ‌యించింది. దీనిని త‌మ ప్ర‌భుత్వం మహిళలకు పెద్ద దీపావ‌ళి కానుకగా పేర్కొంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలో వాటాదారులకు ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లను అందజేస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్ర‌క‌టించారు. సీఎం యోగి తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 2 కోట్ల కుటుంబాలకు మేలు జరగడంతో పాటు పండుగ ఆనందం రెట్టింపు కానుందని ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

Free LPG gas cylinder - PMUY

సీఎం యోగి పోస్ట్‌లో ఏం చెప్పారంటే? 

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్స్‌లో పోస్ట్‌ను పంచుకుంటూ దీపావ‌ళి ఉచిత సిలిండ‌ర్ సమాచారాన్ని అందించారు. దీపావళి సందర్భంగా ప్రధానమంత్రి ఉజ్వల పథకం లబ్ధిదారులందరికీ ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ చేయాలని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సీఎం యోగి తన పోస్ట్‌లో రాశారు. ఈ నిర్ణయానికి సంబంధించిన అన్ని లాంఛనాలను సంబంధిత అధికారులు సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి సందర్భంలోనూ దీపావళికి ముందే లబ్ధిదారులందరి ఇళ్లలో ఎల్‌పిజి సిలిండర్లు అందుబాటులో ఉండాలని అధికారుల‌కు సూచనలు పంపారు.

Free LPG gas cylinder - PMUY

ఉజ్వల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఎవ‌రికి లాభం? 

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2016 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ పథకం కింద పేద కుటుంబాలకు చెందిన మహిళలు గ్యాస్ సిలిండర్, స్టవ్‌తో సహా ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తారు. అంతే కాకుండా మళ్లీ గ్యాస్ సిలిండర్ నింపుకుంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా ఇస్తారు. ప్ర‌భుత్వ‌ డేటా ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో 1.75 కోట్ల కుటుంబాలు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నాయి. ఈ కుటుంబాలన్నింటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపావళికి ముందు ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రయోజనాన్ని అందజేస్తుంది. ఉజ్వల పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు ఇంకా దరఖాస్తు చేసుకోని ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్న మహిళలు ఇందులో చేరి ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ ను పొంద‌వ‌చ్చు. ప్రయోజనం ఉజ్వల పథకంలో ఉన్న మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. 

Free LPG gas cylinder - PMUY

ఉజ్వల పథకం ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి? 

మీరు కూడా ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ www.pmuy.gov.inకి వెళ్లాలి. ఇందులో మీకు అప్లికేష‌న్ ఫారంలు క‌నిపిస్తాయి. వీటిని మీకు కావాల్సిన భాష‌లో డౌన్ లోడ్ చేసుకోవాలి. మీరు ఈ ఫారమ్‌ను ELPG సెంటర్ నుండి కూడా తీసుకోవచ్చు. దీని తరువాత, ఫారమ్ నుండి ప్రింట్ అవుట్ తీసుకొని మొత్తం సమాచారాన్ని పూరించండి. మీరు ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాలను సమీప LPG సెంటర్‌లో సమర్పించాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీరు ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందుతారు. దేశంలోని అర్హులైన ఎవ‌రైనా దీనికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

Latest Videos

click me!