అగ్నివీర్ చనిపోతే ఆ కుటుంబానికి ఏం వస్తుంది? అగ్నిపథ్ పథకం నిబంధనలు ఎలా వున్నాయంటే

First Published Oct 12, 2024, 1:47 PM IST

మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో సైనిక శిబిరంలో అగ్నిప్రమాదం జరిగి ఇద్దరు జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే విధుల్లో వుండగా అగ్నివీర్ జవాన్ చనిపోతే ఎలాంటి పరిహారం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

Agniveer

భారత సైన్యంలో అగ్నివీర్ ల ఎంపికపై వివాదం కొనసాగుతూనే వుంది. కాంట్రాక్ట్ పద్దతిలో నిర్ణీత కాలానికి యువతను సైన్యంలో చేర్చుకోవడమే అగ్నిపథ్  పథకం. ఈ పథకం ద్వారా సైన్యంలో చేరేవారు కేవలం నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతారు. ఆ  తర్వాత వారి పనితీరు, ఇతర విషయాల ఆధారంగా సైన్యంలో కొనసాగించాలా... లేక తీసివేయాలా అన్నది అధికారులే నిర్ణయిస్తారు. 

మహారాష్ట్ర నాసిక్ లోని ఓ సైనిక శిబిరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ సాధారణ శిక్షణ సమయంలో కొందరు సైనికులు ఫిరంగి కాల్పులు చేస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అగ్నివీర్ జవాన్లు తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ ఘటన తర్వాత శిబిరం మొత్తం గందరగోళం నెలకొంది.పేలుడుకు ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

అయితే ఈ ఇద్దరు సైనికులకు అమరవీరుల హోదా ఇవ్వాలని, వారి కుటుంబాలకు దాని ప్రయోజనాలను అందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అగ్నివీర్ లు డ్యూటీలో వుండగా మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఎలాంటి సాయం అందిస్తారు? సాధారణ సైనికుడి మాదిరిగానే లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. 

Agniveer

అగ్నిపథ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు...

భారత సైన్యంలో సైనికుల నియామకం కోసం మోదీ సర్కార్  2022లో 'అగ్నిపథ్ స్కీమ్' ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సైనికులను 4 సంవత్సరాల పాటు సైన్యంలో నియమిస్తారు... అటువంటి సైనికులను 'అగ్నివర్స్' అని పిలుస్తారు. ఈ పథకం కింద సాయుధ దళాల్లో సైనికుల నియామకానికి 17.5 నుంచి 21 సంవత్సరాల వయస్సును నిర్ణయించారు. ఈ అగ్నిపథ్ పథకం ద్వారా ఇప్పటివరకు భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళంలో వేలాది మంది సైనికులను రిక్రూట్ చేసుకున్నారు.

Latest Videos


Agniveer

అగ్నివర్స్ కు ఎంత జీతం వస్తుంది?

అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్ అయిన సైనికులకు ఉద్యోగం వచ్చిన మొదటి సంవత్సరంలో ప్రతి నెలా రూ.30 వేల జీతం లభిస్తుంది. ఇందులో వారికి రూ .21 వేలు చేతితో లభిస్తుంది. వేతనంలో 30 శాతం అంటే రూ .9 వేలు సేవా నిధిగా కట్ చేయబడతాయి. అగ్నివీర్స్ జీతం ప్రతి సంవత్సరం 10 శాతం పెరుగుతుంది.  అందులో 30 శాతం సర్వీస్ ఫండ్ గా కట్ చేయబడుతుంది.

వారి సర్వీస్ పీరియడ్ ముగిశాక ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచి చివరి నెల వరకు సర్వీస్ ఫండ్ గా కట్ చేసిన డబ్బును తిరిగి ఇస్తారు.జీతం నుండి కట్ చేసిన డబ్బులకు మరికొంత డబ్బులు ప్రభుత్వం కలిపి రెట్టింపు సొమ్ము ఇస్తుంది. ఇలా 4 సంవత్సరాల సర్వీస్ తర్వాత అగ్నివీర్లకు ఏకమొత్తంగా సుమారు 10 లక్షల రూపాయలు లభిస్తాయి.

Agniveer

డ్యూటీలో మరణించే అగ్నివీర్ల కుటుంబానికి ఏం వస్తుంది?

విధి నిర్వహణలో అగ్నివీర్ మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. విధి నిర్వహణలో అగ్నవీర్ మరణిస్తే అతని కుటుంబానికి రూ.48 లక్షల బీమా, అదనంగా రూ.44 లక్షల ఎక్స్ గ్రేషియా, నాలుగేళ్ల పదవీకాలంలో మిగిలిన కాలానికి పూర్తి వేతనం, సేవా నిధి మొత్తాన్ని అందజేయనున్నట్లు ఆర్మీ వెబ్ సైట్ తెలిపింది.

డ్యూటీలో ఉండగా అగ్నివీర్ వికలాంగుడైతే ఏం దొరుకుతుంది?

అగ్నివీర్ సైనికుడు విధి నిర్వహణలో వికలాంగుడైతే అంగవైకల్యం ఆధారంగా కొంత మొత్తాన్ని ఇస్తారు. అగ్నివర్లు 100 శాతం వికలాంగులైతే వారికి రూ.44 లక్షలు వస్తాయి. అదే సమయంలో అగ్నివీర్ 75 శాతం అంగవైకల్యానికి గురైతే రూ.25 లక్షలు, 50 శాతం అంగవైకల్యానికి రూ.15 లక్షలు ఇస్తారు. వీటితో పాటు 4 ఏళ్ల పాటు పూర్తి జీతం, సర్వీస్ ఫండ్లో జమ చేసిన మొత్తంతో పాటు ప్రభుత్వం నుంచి కంట్రిబ్యూషన్ లభిస్తుంది.

click me!