రూ.18 వేలతో..360 సీట్ల విమానంలో ఒకే ఒక్కడు ప్రయాణం.. !

First Published May 27, 2021, 11:10 AM IST

బోయింగ్ 777  ఎమిరేట్స్ విమానం అది. 360 సీట్లున్న ఈ విమానం ఒక ట్రిప్పు ఇంధనం ఖర్చు ఎనిమిది లక్షలు అవుతుంది. ఇలాంటి విమానంలో ఓ వ్యక్తి కేవలం రూ. 18 వేలకు టికెట్ కొని ఒక్కడే ప్రయాణం చేశాడంటే నమ్మశక్యం కాదు.

బోయింగ్ 777 ఎమిరేట్స్ విమానం అది. 360 సీట్లున్న ఈ విమానం ఒక ట్రిప్పు ఇంధనం ఖర్చు ఎనిమిది లక్షలు అవుతుంది. ఇలాంటి విమానంలో ఓ వ్యక్తి కేవలం రూ. 18 వేలకు టికెట్ కొని ఒక్కడే ప్రయాణం చేశాడంటే నమ్మశక్యం కాదు.
undefined
దుబాయ్ కి చెందిన వజ్రాల కంపెనీ స్టార్ జెమ్స్ సీఈఓ గా పని చేస్తున్న భవేష్ జవేరికి ఆ అదృష్టం దక్కింది .వారం రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.కరోనా కారణంగా భారతీయ ప్రయాణికులపై యూఏఈ విధించిన కొత్త ఆంక్షలతో ఇది సాధ్యమైంది. అక్కడికి పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతిస్తున్నారు.
undefined
దౌత్యపరమైన సిబ్బంది, గోల్డెన్ వీసా ఉన్నవారు, అరబ్ జాతీయులు, ప్రయాణికులకు మాత్రమే అనుమతిస్తూ.. బిజినెస్ తరగతిలో వెళ్లేవారికి Covid 19 పిసిఆర్ పరీక్షలు తప్పనిసరి చేశారు. భారత్లో కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి నెల రోజుల పాటు ఈ ఆంక్షలు విధించారు. మళ్లీ జూన్ 14 దాకా పొడిగించినట్లు ప్రకటించారు.
undefined
వారం కిందట మే 19న దుబాయ్ నుంచి ముంబైకి చేరిన బోయింగ్ 777 విమానం తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. ఆ రోజుకు యూఏఈ గోల్డెన్ వీసా కార్డుతో పాటు అన్ని అనుమతులు ఉన్న ప్రయాణికుడు భవేష్ జవేరి ఒక్కరే కావడంతో నిబంధనల ప్రకారం ఆయనకు టికెట్ జారీ చేశారు.
undefined
360 సీట్ల విమానంలో తానొక్కడే దుబాయ్ కి వెళ్తున్నట్టు తెలిసిన భవేష్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విమానం ఎక్కగానే విమాన సిబ్బంది ఆయనకు చప్పట్లతో స్వాగతం పలికారు. తన లక్కీ నెంబర్ 18 చెప్పగానే సాధారణంగా ఆ సీటు వద్దకు తీసుకుపోయారు.
undefined
విమాన కమాండర్ సైతం వచ్చి మాట్లాడారు. విమానమంతా కలయతిరుగుతూ, సిబ్బందితో సరదా కబుర్లు చెబుతూ భవేష్ దుబాయ్కి చేరుకున్నారు. అపూర్వమైన, అరుదైన ఈ అనుభవం గురించి ఆయన మాట్లాడుతూ... ముంబై, దుబాయ్ ల మధ్య ఇప్పటికి దాదాపు రెండు వందల నలభై సార్లు తిరిగాను. ఈ ట్రిప్పు ఇచ్చిన అనుభూతి మాత్రం ప్రత్యేకం.. అద్భుతం.’ అని స్పందించారు.
undefined
click me!