Omicron Effect: అంతర్జాతీయ విమాన సేవల పునరుద్ధరణపై కేంద్రం యూటర్న్?

Published : Dec 01, 2021, 03:45 PM IST

అంతర్జాతీయంగా వణికిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా చాలా దేశాలు అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలు మళ్లీ విధిస్తున్నారు. ముఖ్యంగా ఐరోపా దేశాలు వేగంగా ఈ పని చేశాయి. కానీ, మన దేశంలో ఇంకా అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలే అమలవుతున్నాయి. అయితే, ఈ నెల 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరిస్తామని గత నెల 26న కేంద్రం ప్రకటించింది. కానీ, ఒమిక్రాన్ కారణంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు సూత్రప్రాయంగా ఓ ప్రకటనలో వెల్లడించింది.  

PREV
18
Omicron Effect: అంతర్జాతీయ విమాన సేవల పునరుద్ధరణపై కేంద్రం యూటర్న్?

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తాండవించడంతో గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధం
కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికీ ఇంటర్నేషనల్ షెడ్యూల్డ్ ఫ్లైట్స్‌పై ఆంక్షలు అమల్లోనే ఉన్నాయి. అయితే, భారత ప్రభుత్వం31 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. తద్వారా ఆ దేశాలకు మన దేశానికి మధ్య కొన్నినిబంధనలకు లోబడి ప్రయాణాలు సాగుతున్నాయి.

28

అయితే, గత నెల 26న కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించబోతున్నట్టు ప్రకటించింది. కేంద్ర హోం శాఖ వ్యవహారాలు, కేంద్ర విదేశాంగ వ్యవహారాలు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది.

38

ఇంతలోనే దక్షిణాఫ్రికా నుంచి భయంకర వార్త వచ్చింది. డెల్టా వేరియంట్ కంటే కూడా ఎక్కువ మ్యూటేషన్లు ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అక్కడ నమోదైనట్టు తెలిసింది. దీంతో యూకే, ఇటలీ, జర్మన్ సహా పలు దేశాలు వెంటనే ఆ దేశం నుంచి ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

48

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వేరియంట్ ఆందోళనకారకమైనదని స్పష్టం చేయడంతో పరిస్థితులు గంభీరంగా మారిపోయాయి. దీంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తేయాలనుకున్న కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

58

ఈ నేపథ్యంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మరో ఆర్డర్‌ను విడుదల చేసింది. ఈ ఆదేశాలు గత నెల 26న చేసిన ఆదేశాలపై యూటర్న్ తీసుకున్నట్టుగానే సూత్రప్రాయంగా పేర్కొన్నాయి.

68

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తాజాగా డీజీసీఏ వెల్లడించింది. ఇతర భాగస్వామ్యాలతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది. ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసిజంర్ ఫ్లైట్స్ సేవల పునరుద్ధరణ తేదీని తర్వాత నోటిఫై చేస్తామని వివరించింది.

78

దీనిపై డీజీసీఏకు చెందిన ఓ సీనియర్ అధికారి స్పందించారు. ఈ ప్రకటనతోనే గత నెల 26న విడుదల చేసిన ఆదేశాలను పక్కకు పెట్టినట్టేనని వివరించారు.

88

ఈ నెల 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు పునరుద్ధరిస్తామని గత నెల 26న కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories