FASTag : ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్... టోల్ గేట్లు వద్ద నో క్యాష్

Published : Jan 21, 2026, 07:57 PM IST

New Toll Plaza Rules : ఇప్పటికే వాహనాలన్నింటికి ఫాస్టాగ్ తప్పనిసరి అయ్యింది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద మరింత ఈజీగా ఫీజు చెల్లించే నిబంధనలను తీసుకువస్తున్నారు. ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్ రానున్నాయి. 

PREV
15
టోల్ ప్లాజాల వద్ద నగదుతో పనిలేదు..

FASTag : మీరు రోజూ హైవేపై ప్రయాణిస్తారా? ఈ ఏప్రిల్‌ తర్వాత ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. ఏప్రిల్ 1 నుంచి దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు క్యాష్‌లెస్ అవుతున్నాయి. టోల్ గేట్ల వద్ద నగదు చెల్లించడం కుదరదు.

25
ఫాస్టాగ్ ఉంటేనే ప్రయాణం..

కేంద్ర ప్రభుత్వం టోల్ సిస్టమ్‌లో పెద్ద మార్పు ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు పూర్తిగా బంద్. ఫాస్టాగ్ ద్వారా ఆటోమేటిక్‌గా టోల్ కట్ అవుతుంది. ఫాస్టాగ్‌లో సమస్య ఉంటే యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. ఈ డిజిటల్ సౌకర్యాలు లేకపోతే జరిమానా విధించవచ్చు.

35
టోల్ గేట్ వద్ద నో వెయిటింగ్..

ఫాస్టాగ్ ఉన్నా చాలామంది నగదు చెల్లిస్తున్నారు. దీనివల్ల టోల్ గేట్ల వద్ద భారీ క్యూలు ఏర్పడి ప్రయాణ సమయం పెరుగుతోంది. నగదు లావాదేవీలు ఆపితే వాహనాలు ఆగకుండా వెళ్తాయి. ప్రయాణం వేగవంతమై ఇంధనం కూడా ఆదా అవుతుంది.

45
నో-స్టాప్ టోలింగ్..

ప్రభుత్వం 25 టోల్ ప్లాజాల్లో 'నో-స్టాప్ టోలింగ్' పరీక్షిస్తోంది. ఇందులో హై-స్పీడ్ కెమెరాలు, సెన్సార్లు ఉంటాయి. ఇవి వెళ్తున్న వాహనం నుంచే టోల్ కట్ చేస్తాయి. భవిష్యత్తులో టోల్ బూత్‌లు, బారియర్లు ఉండవు. ఏప్రిల్ 1 నాటి క్యాష్‌లెస్ నిర్ణయం దీనికి తొలి అడుగు.

55
యూపిఐ లేకుంటే ప్రయాణమూ కష్టమే..

ఏప్రిల్ 1 లోపు మీ ఫాస్టాగ్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోండి. మొబైల్‌లో యూపీఐ యాప్, ఇంటర్నెట్ ఆన్‌లో ఉండేలా చూసుకోండి. ఫాస్టాగ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి. డిజిటల్ పేమెంట్ సౌకర్యం లేకపోతే జరిమానా పడొచ్చు లేదా వెనక్కి పంపే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories