వివాహేతర సంబంధం : ప్రియుడితో కలిసి భర్తను కాల్చి చంపి, అడవిలో పాతిపెట్టి...

Bukka Sumabala | Published : Jul 24, 2023 10:01 AM
Google News Follow Us

తనకంటే వయసులో పన్నెండేళ్లు చిన్నవాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఓ మహిళ. దీనికి భర్త అడ్డుగా ఉన్నాడని అతడిని దారుణంగా హతమార్చింది. 

17
వివాహేతర సంబంధం : ప్రియుడితో కలిసి భర్తను కాల్చి చంపి, అడవిలో పాతిపెట్టి...

నవీ ముంబై : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ కేసులో ఓ హౌస్ పెయింటర్  అయిన ప్రియుడితో పాటు ఆ మహిళను నేరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులు రుషికేశ్ తుపే (24), అరుణా ముర్బే (36) అని నేరాల ఏపీఐ శివాజీ ధావలే తెలిపారు. 

27

హత్యకు గురైన వ్యక్తిని కర్జాత్ తాలూకాలోని దేవ్‌పాడలో నివాసం ఉంటున్న ఆటోరిక్షా డ్రైవర్‌ సచిన్‌ ముర్బే (38)గా గుర్తించారు. అరుణ జూలై 15న నేరల్ పోలీస్ స్టేషన్‌లో సచిన్ మిస్సింగ్‌పై ఫిర్యాదు చేసింది. 

37

సచిన్ స్నేహితుడు, దూరపు బంధువు అయిన రుషికేశ్ ఆ సమయంలో అరుణతో పాటు వచ్చాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. 
 

Related Articles

47

దర్యాప్తులో భాగంగా  కానిస్టేబుల్ ప్రవీణ్ లోఖండేకు సచిన్..రుషికేశ్ తో కలిసి దేవ్‌పాడ గ్రామంలోని ఆరి ఫారెస్ట్‌కు వేటకు వెళ్లారని, ఆ తర్వాత సచిన్ కనిపించకుండా పోయాడని తెలిసింది.

57

ఇన్‌స్పెక్టర్ ధావలే మాట్లాడుతూ, "సచిన్‌ను వేటకు ఉపయోగించే రైఫిల్‌తో హత్య చేసినట్లు రుషికేశ్ అంగీకరించాడు. ఆ తర్వాత, సచిన్ మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టాడు. 

67

రెండు సెల్‌ఫోన్‌లను వాగులో విసిరేశాడు. సచిన్ ను పాతిపెట్టడానికి గొయ్యి తీయడానికి ఉపయోగించిన పలుగు, పార, హ్యాండిల్‌ను కూడా వివిధ ప్రదేశాలలో విసిరేశాడు"

77

"సచిన్ సమాధిని గుర్తించేందుకు రుషికేశ్‌ను ఆరి ఫారెస్ట్‌కు తీసుకెళ్లారు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కర్జాత్ సమక్షంలో అతని మృతదేహాన్ని వెలికితీశారు. దానిని పోస్ట్‌మార్టం కోసం జెజె ఆసుపత్రికి పంపారు" అని ధావలే తెలిపారు.

Recommended Photos