వివాహేతర సంబంధం నేరం కాకపోతే.. హోటళ్లలో పోలీసుల దాడులు ఎందుకు? అసలు చట్టం ఏం చెబుతోంది?

Published : Jul 16, 2026, 02:33 PM IST

Extra Marital Affair: భారత్‌లో వివాహేతర సంబంధం గురించి చాలా మందిలో ఇప్పటికీ అపోహలు ఉన్నాయి. హోటళ్లలో జంటలపై పోలీసులు దాడులు చేశారనే వార్తలు తరచూ కనిపిస్తుంటాయి. దీంతో వివాహేతర సంబంధం నేరం కాకపోతే పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటారనే సందేహం రావడం కామన్

PREV
14
2018లో సుప్రీంకోర్టు కీలక తీర్పు

2018లో జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో భారతీయ శిక్షాస్మృతిలోని (IPC) సెక్షన్ 497ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ రద్దు చేసింది. అంతకుముందు వివాహితుడైన పురుషుడు మరో వివాహిత మహిళతో ఆమె భర్త అనుమతి లేకుండా సంబంధం పెట్టుకుంటే దానిని నేరంగా పరిగణించేవారు. అయితే ఈ చట్టం మహిళను పురుషుడి ఆస్తిగా చూసే విధంగా ఉందని, ఇది సమానత్వ హక్కుకు విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. అప్పటి నుంచి భారతదేశంలో వివాహేతర సంబంధం క్రిమినల్ నేరంగా పరిగణించడం లేదు. అయితే ఇది విడాకులు వంటి కుటుంబ వివాదాల్లో మాత్రం ఒక కారణంగా పరిగణించే అవకాశం ఉంటుంది.

24
మరి హోటళ్లకు పోలీసులు ఎందుకు వెళ్తారు?

వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పోలీసులు హోటళ్లకు వెళ్లాల్సి రావచ్చు. ఉదాహరణకు భార్య లేదా భర్త తమ జీవిత భాగస్వామి కనిపించడం లేదని, అపహరణ జరిగిందని లేదా ఇతర ఫిర్యాదులు చేస్తే వాటిని పరిశీలించడానికి పోలీసులు వెళ్లవచ్చు. అలాగే మానవ అక్రమ రవాణా, చట్ట విరుద్ధమైన చర్యలు, మైనర్లకు సంబంధించిన కేసులు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై విశ్వసనీయ సమాచారం అందితే కూడా పోలీసులు దర్యాప్తు చేయవచ్చు. కాబట్టి ప్రతి హోటల్ తనిఖీకి కారణం వివాహేతర సంబంధమే అనుకోవడం సరైంది కాదు.

34
మైనర్ జంటలకు ఉన్న చట్టపరమైన హక్కులు

ఇద్దరూ 18 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులు పరస్పర అంగీకారంతో హోటల్‌లో బస చేస్తుంటే వారికి వ్యక్తిగత గోప్యత (Privacy) హక్కు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సరైన చట్టపరమైన కారణం లేకుండా పోలీసులకు లేదా ఇతర వ్యక్తులకు వారిని వేధించడం, బెదిరించడం లేదా బలవంతంగా ప్రశ్నించే హక్కు ఉండదు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతకు రక్షణ కల్పిస్తోంది. అందువల్ల కేవలం అనుమానాల ఆధారంగా జంటలను ఇబ్బంది పెట్టడం చట్టబద్ధం కాదు.

44
బ్లాక్‌మెయిల్ చేస్తే ఏం చేయాలి?

కొన్ని సందర్భాల్లో పోలీసుల పేరుతో, ఇతర సామాజిక సంస్థల ప్రతినిధులమని చెప్పుకుంటూ కొందరు జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఎవరైనా బెదిరించడం, డబ్బులు డిమాండ్ చేయడం లేదా బలవంతంగా వీడియోలు, ఫోటోలు తీయడం వంటి చర్యలకు పాల్పడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. అందుకే వివాహేతర సంబంధాలకు సంబంధించిన చట్టాలు, వ్యక్తిగత హక్కుల గురించి సరైన అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories