చెన్నై : వేరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 45 ఏళ్ల వ్యక్తి తన భార్యను హత్య చేసిన ఘటన కాంచీపురం జిల్లా వాలాజాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.
25
కప్పుకారన్ వీధికి చెందిన శ్రీధర్ (45) భార్యను హత్య చేసిన వెంటనే.. పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి హత్య గురించి చెప్పాడు.
35
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీధర్, సెల్వరాణి (35) దంపతులకు 18 సంవత్సరాల క్రితం వివాహమయ్యింది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
45
మద్యానికి బానిసైన శ్రీధర్ భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ.. తరచుగా గొడవ పడేవాడు. మద్యం మానడానికి డీఅడిక్షన్ సెంటర్ లో చేరిన శ్రీధర్ ఇటీవలే బయటకు వచ్చాడు. సెల్వరాణి పొదుపు చేసుకున్న రూ. 5 లక్షలు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు.
55
శుక్రవారం ఉదయం శ్రీధర్ తన భార్య ఉద్యోగం కోసం బయటకు వెడుతుండడంతో.. అది ఇష్టం లేక ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శ్రీధర్ వంటింటి కత్తితో భార్య సెల్వరాణిని పొడిచి చంపాడు. వాలాజాబాద్ పోలీసులు అతడిని హత్యానేరం కింద అరెస్టు చేశారు.