74 ఏళ్ల ఈ యూట్యూబర్ అమ్మమ్మ.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

Published : Aug 20, 2025, 09:54 PM IST

74 ఏళ్ల సుమన్ ధమనే అనే మహిళ పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని నిరూపించారు. మనవడి సహాయంతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన ఆమె ఇప్పుడు నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?  

PREV
15
ఈ యూట్యూబర్ మామూలు మహిళ కాదుగురూ...

74 ఏళ్ల సుమన్ ధమనే అనే మహిళ కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి, అద్భుతాలు చేసి విజయం సాధించడానికి వయస్సు అడ్డుకాదని నిరూపించారు. తన మనవడి సహాయంతో 'ఆప్లీ ఆజీ' అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన ఆమె ఇప్పుడు 17.9 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కలిగివున్నారు. తన వీడియోల ద్వారా నెలకు 5 నుండి 6 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. సుమన్ తన ఛానెల్‌లో సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలను తయారుచేసే వీడియోలు పెడుతుంటారు. కుటుంబ సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈమె కథ చెబుతోంది.

25
మనవడి పావ్ భాజీ కోరికే ఆమెను స్టార్ ని చేసింది

సుమన్ ధమనే మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ సమీపంలోని సరోలా కసర్ గ్రామానికి చెందినవారు. ఆమె మార్చి 2020లో తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. ఈ ఆలోచన ఆమె 17 ఏళ్ల మనవడిది. మనవడు పావ్ బాజీ చేయమని అడిగిన చిన్న కోరిక ఆమెను ఇక్కడివరకు తీసుకువచ్చింది.

యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశారుగానీ సుమన్‌ అంత సులభంగా క్లిక్ కాలేరు. కెమెరా ముందుకు రావడానికి ఆమె మొదట భయపడేవారు… అలాగే అనేక సాంకేతిక సమస్యలు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ఎదుర్కొంది. ఒకసారి ఛానెల్ హ్యాక్ కూడా అయ్యింది… అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. సరికొత్తగా, ఆసక్తికరమైన వీడియోలతో ప్రజలను ఆకట్టుకోవడం ప్రారంభించారు. ఆమె వంటకాలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. చివరికి యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు పెరగడంతో ఆమెకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేరు.

35
డిజిటల్ ప్రపంచంలో విజయం

ఇప్పుడు సుమన్ ధమనే తన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ వయసులో తనకు తెలిసిన వంటలు చేయడమే కాదు తెలియని ఇంటర్నెట్, సోషల్ మీడియా గురించి ఆమె నేర్చుకున్నారు. డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం కుటుంబ సభ్యుల మద్దతు వల్లే సాధ్యమైందని సుమన్ ధమనే చెబుతారు.

మొదట్లో ఆమెకు ఇంటర్నెట్ వాడిన అనుభవం లేదు. ఆమె మనవడు యష్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడంలో సహాయం చేశాడు… అలాగే సాంకేతిక విషయాలు కూడా నేర్పించాడు. సుమన్ ధమనే కూడా ఈ కొత్త ప్రయాణాన్ని స్వీకరించారు. తన వంట నైపుణ్యం, సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలను ప్రపంచానికి పరిచయం చేశారు.

45
సొంత అమ్మమ్మ, నాన్నమ్మలా ప్రేమ

'ఆప్లీ ఆజీ' యూట్యూబ్ ఛానెల్ త్వరగా ప్రజాదరణ పొందింది. దీనికి కారణం సుమన్ ధమనే వంటచేసే విధానం… ఆమె మాటలు సొంత అమ్మమ్మ, నాన్నమ్మలను గుర్తుచేస్తుంది. ఆమె వంట శైలి సాంప్రదాయ అహార పదార్థాలు, ఇంట్లో తయారుచేసిన మసాలా దినుసులపై ఆధారపడి ఉంటుంది. ప్రజలు దీన్ని చాలా ఇష్టపడుతున్నారు. ఆమె ఛానెల్‌లో పావ్ బాజీ, కాకరకాయ కూర, సాంప్రదాయ మహారాష్ట్ర స్వీట్లు వంటి అనేక వంటకాలు ఉన్నాయి.

55
సాధారణ మహిళ నుండి మార్గదర్శిగా...

ఇప్పుడు సుమన్ ధమనే కేవలం ఓ యూట్యూబ్ స్టార్ మాత్రమే కాదు… చాలామందిలో స్ఫూర్తి నింపుతున్న ఓ మార్గదర్శి. వయస్సు విజయానికి అడ్డు కాదని ఆమె నిరూపించారు.  యూట్యూబ్ ఛానెల్ విజయం ఆమెకు అనేక వ్యాపార అవకాశాలను కల్పించింది. ఇప్పుడామె సాంప్రదాయ మసాలా దినుసులను కూడా అమ్ముతున్నారు. ఇది ఆమె అభిమానులు, ఆహార ప్రియులతో మరింత అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడింది. 

ప్రతిఒక్కరు జీవితంలో విజయం సాధించాలంటే మార్పును స్వీకరించాలని ఈమె స్టోరీ చెబుతోంది. మన సక్సెస్ లో కుటుంబ మద్దతు ఎంత ముఖ్యమో, డిజిటల్ ప్రపంచంలో ఎన్ని అవకాశాలున్నాయో ఆమె కథ చెబుతుంది. ఆమె విజయం చదువు ముఖ్యం కాదని, మీరు దృఢ సంకల్పం కలిగి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. 

సుమన్ ధమనే యూట్యూబ్ ఛానల్లో వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read more Photos on
click me!

Recommended Stories