జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఘ‌న విజ‌యం

First Published | Nov 23, 2024, 7:37 PM IST

Jharkhand Assembly Election Results 2024: జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ మ‌రోసారి అధికార పీఠం ద‌క్కించుకున్నారు. 39,791 ఓట్ల తేడాతో బర్హైత్ స్థానంలో సోరెన్  గెలిపొందినట్లు ఎన్నిక‌ల సంఘం  ప్ర‌క‌టించింది. 
 

Jharkhand Assembly Election Results 2024, Hemant Soren, JMM

Jharkhand - Hemant Soren : జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి, రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బర్హైత్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి గెలుపొందారు. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అధికారికంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. బీజేపీ అభ్యర్థి గామ్లియెల్ హెంబ్రోమ్‌పై  ఆయ‌న విజయం సాధించారు. మొత్తం 95,612 ఓట్లతో ఆయన గెలుపొందినట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. 

Jharkhand Assembly Election Results 2024, Hemant Soren, JMM

జార్ఖండ్‌లోని 81 నియోజకవర్గాలలో బర్హైత్ (ST) అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి, షెడ్యూల్డ్ తెగల (ST) అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది. ఇది సాహెబ్‌గంజ్ జిల్లాలో ఉంది. ఇది రాజ్‌మహల్ (ST) పార్లమెంటరీ స్థానంలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఒకటి.

బర్హైత్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ప్ర‌ధాన అభ్య‌ర్థులు భారతీయ జనతా పార్టీ నుంచి గామ్లీల్ హెంబ్రోమ్, జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి హేమంత్ సోరెన్. 39,791 ఓట్ల తేడాతో బర్హైత్ స్థానంలో సోరెన్ గెలిపొందినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.


Jharkhand Assembly Election Results 2024, Hemant Soren,

కాగా, 2019 జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో , జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) హేమంత్ సోరెన్ 73,725 ఓట్లతో విజయం సాధించారు. అతని సమీప పోటీదారు అయిన‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన సైమన్ మరాండి 47,985 ఓట్లు సాధించగా, జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) (జెవిఎం (పి)) హోప్నా టుడు 2,622 ఓట్లు పొందారు.

Jharkhand Assembly Election Results 2024, Hemant Soren, JMM

అంతకుముందు 2014 ఎన్నికల్లో కూడా హేమంత్ సోరెన్ 62,515 ఓట్లతో విజయం సాధించారు. ఆయన తర్వాతి స్థానంలో బీజేపీకి చెందిన హేమ్‌లాల్ ముర్ము 38,428 ఓట్లు సాధించారు. అప్పటి జెవిఎం(పి)కి చెందిన సైమన్ మరాండీకి 14,161 ఓట్లు రాగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు చెందిన మోనికా కిస్కుకు 7,151 ఓట్లు వచ్చాయి. బర్హైత్ (ST) జార్ఖండ్ ముక్తి మోర్చాకు బలమైన కోటగా కొనసాగుతోంది, ఇటీవలి సంవత్సరాలలో హేమంత్ సోరెన్ ఓటర్లపై గణనీయమైన ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. 

ఇదిలావుండ‌గా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌లు 2024 ఫలితాల్లో ఇండియా కూటమి అద్భుత విజ‌యం అందుకుంది.  81 అసెంబ్లీ స్థానాలకు గాను 41 మ్యాజిక్ ఫిగర్ దాటుకుని 57 స్థానాల్లో దూసుకుపోయింది. మొత్తం 81 స్థానాల్లో బీజేపీ 21 స్థానాల్లో, జేజేఎం 34 స్థానాలు, కాంగ్రెస్ 16 స్థానాల్లో ముందున్నాయి. 

Latest Videos

click me!