ఐదేళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు ఇండియన్ రైల్వేస్ టికెట్ మినహాయింపు ఇస్తుంది.
ఉచిత ప్రయాణం: పిల్లాడికి ప్రత్యేకంగా సీటు లేదా బెర్త్ అవసరం లేకపోతే, ఎలాంటి ఛార్జీ లేకుండా ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసేటప్పుడు 'Add Infant without Berth' అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పిల్లల డీటెయిల్స్ ఇవ్వాలి.
సపరేట్ బెర్త్ కావాలంటే?: ఒకవేళ మీ పిల్లాడికి ప్రత్యేకంగా బెర్త్ కావాలనుకుంటే మాత్రం, పెద్దల మాదిరిగానే పూర్తి టికెట్ డబ్బులు చెల్లించి బుక్ చేసుకోవాలి.
ఐదేళ్ల నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలకు రైలు ప్రయాణంలో రెండు ఆప్షన్లు ఉంటాయి.
బెర్త్ వద్దనుకుంటే సగం టికెట్: పిల్లాడికి సపరేట్ సీటు లేదా బెర్త్ అవసరం లేకపోతే, పెద్దల టికెట్ ధరలో సగం మాత్రమే వసూలు చేస్తారు. ఇలాంటప్పుడు పిల్లలు తల్లిదండ్రుల సీటులోనే కూర్చొని ప్రయాణించాలి.
బెర్త్ కావాలంటే ఫుల్ టికెట్: దూర ప్రయాణాల్లో పిల్లలు హాయిగా నిద్రపోవడానికి సపరేట్ బెర్త్ కావాలనుకుంటే, పెద్దల మాదిరిగానే పూర్తి టికెట్ డబ్బులు చెల్లించాలి.