PM Modi Mann Ki Baat: ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’.. ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందో తెలుసా?

Published : Aug 09, 2025, 10:29 AM IST

PM Modi Mann Ki Baat: Mann Ki Baat: ప్రధానమంత్రి మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం ఇప్పటివరకు రూ.34.13 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంది.

PREV
15
మోడీ ప్రతిష్టాత్మక కార్యక్రమం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ‘మన్ కీ బాత్’.ఈ రేడియో కార్యక్రమం దేశవ్యాప్తంగా కోట్లాది మంది శ్రోతలను ఆకట్టుకుంటూ, ప్రజలతో నేరుగా మమేకమయ్యే వేదికగా నిలిచింది. 2014లో ప్రారంభమైన ప్రొగ్రామ్ సామాజిక సమస్యల నుంచి దేశాభివృద్ధి దిశగా పలు అంశాలను చర్చిస్తూ, ప్రజల్లో చైతన్యం నింపడమే కాకుండా, ఆర్థికంగా కూడా విశేష ఆదాయాన్ని సాధించింది. 2014 నుంచి ఇప్పటి వరకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందంటే?

25
ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’. ఈ కార్యక్రమం ఇప్పటివరకు ₹34.13 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఈ విషయాన్ని సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని ఇస్తూ.. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా, ఇప్పటికే ఉన్న వనరులను ఉపయోగించి ప్రసారం చేస్తున్నట్టు తెలిపారు. మన్ కీ బాత్ సాంప్రదాయ ప్రసార మాధ్యమాలు (ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్) తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ప్రజలకు చేరువైందని తెలిపారు. 

35
ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది?

మోదీ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మొదటిసారి 2014 అక్టోబర్ 3న ప్రారంభమైంది. దేశంలోని ప్రతి వర్గానికి ప్రజలకు చేరువ అయ్యేలా ఈ కార్యక్రమాన్ని జాతీయ, ప్రాంతీయ రేడియో నెట్‌వర్క్‌లతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం దూరదర్శన్ జాతీయ, ప్రాంతీయ ఛానెల్స్, 48 ఆకాశవాణి రేడియో ఛానెల్స్, 92 ప్రైవేట్ టీవీ ఛానెల్స్ ద్వారా DD ఫ్రీ డిష్‌లో కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల గ్రామీణ, సుదూర ప్రాంతాల ప్రజలకూ ఈ కార్యక్రమం చేరుతోంది.

45
డిజిటల్ రంగంలోనూ

డిజిటల్ రంగంలోనూ మన్ కీ బాత్ కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తుంది. మన్ కీ బాత్ PMO ఇండియా, AIR, ప్రసార భారతి యూట్యూబ్ ఛానెల్స్ తోపాటు పలు OTT ప్లాట్‌ఫామ్స్, NewsOnAIR మొబైల్ యాప్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. NewsOnAIR యాప్‌లో 260కుపైగా AIR ఛానెల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రసార భారతి న్యూస్ ఫీడ్ సర్వీస్ PB Shabd ద్వారా ఈ కార్యక్రమాన్ని అనుబంధ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అందిస్తున్నారు. అలాగే, ఫేస్‌బుక్, X (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది వీక్షకులు, శ్రోతలు ఈ కార్యక్రమాన్ని అనుసరిస్తున్నారు.

55
ప్రజలతో మమేకం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ‘మన్ కీ బాత్’.ఈ కార్యక్రమం ప్రత్యేకమైన విజువల్, ఆడియో ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలను నేరుగా మమేకం చేయడంలో, సమిష్టి చర్చకు వేదిక కల్పించడంలో విజయవంతమైంది. అదనపు ఖర్చు లేకుండా ఆకాశవాణి నిర్మించే ఈ కార్యక్రమం రేడియో, టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా, విదేశాల్లో కోట్లాది శ్రోతలకు చేరుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories