ఎన్నో జ‌న్మ‌ల ఫ‌లమిది.. అయోధ్య రామయ్య దివ్యమంగళ దర్శనం.. ఫొటోలు మీరు చూసేయండి.. !

First Published Jan 22, 2024, 1:21 PM IST

Ayodhya Ram Mandir Pran Pratishtha: అయోధ్యలో అపురూప ఘ‌ట్టం అవిష్కృత‌మైంది. అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ‌ప్ర‌తిష్ఠ పూర్త‌యింది. ఎన్నో జన్మల ఫలమిది.. అయోధ్య రామయ్య దివ్య మంగళ దర్శనం మీరు చూసేయండి మరి.. ! 
 

ram lalla statue

Ayodhya Ram Lalla Pran Pratishtha: అయోధ్యలో రామ్లాలా విగ్రహ ప్రతిష్ఠతో స‌రికొత్త‌ చరిత్ర లిఖించ‌బ‌డింది. ఈ చారిత్రాత్మక కార్యాన్ని పూర్తి చేయడానికి ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిరం పూజా కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకున్నారు.

ప్ర‌త్యేక పూజ‌ల క్ర‌మంలో అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ‌ప్ర‌తిష్ఠ పూర్త‌యింది. దీంతో నేడు భారతదేశ చరిత్రలో మరో అధ్యాయం చేరింది.  

రామ నామం జ‌పిస్తేనే మ‌నం చేసిన పాపాల‌న్ని తొల‌గిపోతాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. రాముని దివ్య మంగ‌ళ స్వ‌రూపం చూస్తే ఎన్నో జ‌న్మ‌ల పుణ్య‌ఫ‌లం ల‌భిస్తుంది. 

అయోధ్య రామయ్య దివ్య మంగ‌ళ స్వ‌రూపం ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. 

Modi

ప్రధాన మంత్రి మోడీతో పాటు అయోధ్య బాలరాముడికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాలరాముడికి హారతి ఇచ్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా రామయ్యకు హారతి ఇచ్చారు. అయోధ్య  బాలరాముడికి ప్రధాని ఫలాలు సమర్పించారు.   

అయోధ్య బాలరాముడు ఆభరణాలు ధరించి మరింత సుందరంగా మారారు. ఆ రామయ్య ప్రాణప్రతిష్ట పూజలు అందుకుంటున్నారు.

అయోధ్య రామమందిరంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి అతిథులు మైమరచిపోయారు.  

అయోధ్య  బాలరాముడు కొలువైన గర్భగుడిలో  ప్రధాని నరేంద్ర మోడీ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాత్రమే పాల్గొన్నారు. 

click me!