రామ్ నాథ్ కోవింద్ నుంచి అంబానీ, బచ్చన్, టెండూల్కర్ వరకు.. అయోధ్య రాముని ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు విచ్చేసిన ప్రముఖులు

First Published | Jan 22, 2024, 11:32 AM IST

Ayodhya Ram Mandir Pran Pratishtha: దేశ‌విదేశాల్లో ఉన్న ఎంతో మంది ప్రముఖులు అయోధ్య రామ‌య్య ప్రాణ‌ ప్రతిష్ఠ కోసం అయోధ్యకు చేరుకున్నారు. ఇంకా చాలా మంది వ‌స్తున్నారు. క్రీడలు, సైన్స్, కళలు, పరిశ్రమలు, వినోదం సహా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. వారిలో.. 
 

Ayodhya

Ayodhya Ram Mandir Pran Pratishtha: అయోధ్య రామమందిరం ప్రాణ ప్ర‌తిష్ఠ కోసం ఎంతో మంది ప్ర‌ముఖులు అయోధ్య‌కు చేరుకున్నారు. రామ్ లల్లా పవిత్రోత్సవం కోసం చాలా మంది వీవీఐపీలు ఇప్ప‌టికే అయోధ్యకు చేరుకోగా, మ‌రికొంత‌మంది వ‌స్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. అయోధ్య రాముని ప్రాణ ప్ర‌తిష్ఠ కోసం వ‌చ్చిన వారిలో క్రీడలు, సైన్స్, కళ, పరిశ్రమ, వినోద రంగం స‌హా  ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. వారి వివ‌రాలు గ‌మ‌నిస్తే.. 

Ayodhya Ram Temple

రాజ‌కీయ వ‌ర్గాల నుంచి..

రాజకీయ ప్రపంచం వ‌ర్గాల నుంచి అయోధ్యకు చేరుకున్న వ్యక్తులలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రతిభా పాటిల్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ స్పీకర్ మీరా కుమార్, సుమిత్రా మహాజన్, రవిశంకర్ ప్రసాద్ లు ఉన్నారు. ఇంకా చాలా మంది వ‌స్తున్నారు. 


వ్యాపార రంగం నుంచి

అయోధ్యకు చేరుకుంటున్న వ్యాపార-పరిశ్రామిక రంగానికి చెందిన వారిలో ముఖేష్-నీతా అంబానీ, లక్ష్మీ నివాస్ మిట్టల్, నుస్లీ వాడియా, గౌతమ్ అదానీ, అజయ్ పిరమల్, అనిల్ అగర్వాల్, రేఖా ఝున్‌ఝున్‌వాలా, ఆది గోద్రేజ్, ఎల్ అండ్ టీ చైర్మన్ ఏఎమ్ నాయక్, సునీల్ మిట్టల్, సుధా మూర్తిలు ఉన్నారు. 

క్రీడా రంగం

క్రీడా ప్రపంచం నుంచి భారతరత్న సచిన్ టెండూల్కర్‌, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, పిటి ఉషా, సునీల్ గవాస్కర్, సైనా నెహ్వాల్, కె శివన్ అయోధ్యకు వ‌చ్చారు. అలాగే, సైన్స్ రంగం నుంచి కె కస్తూరిరంగన్, మెట్రోమ్యాన్ ఇ. శ్రీధరన్, విద్యావేత్త టివి మోహన్‌దాస్ పాయ్ అయోధ్యకు చేరుకున్నారు.

వినోద ప్రపంచానికి చెందిన వారిలో.. 

బాలీవుడ్ నుండి అయోధ్య చేరుకున్న వారిలో అమితాబ్, ఆయ‌న‌ కుమారుడు అభిషేక్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, హేమ మాలిని, ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్, అరుణ్ గోవిల్, ప్రసూన్ జోషి, శంకర్ మహదేవన్, సుభాష్ ఘై, అనురాధ పాడ్వాల్ ఉన్నారు.

రామాలయ శిల్పి కూడా.. 

మనోజ్ ముకుంద్ నరవణే, ఎస్ పద్మనాభన్, మిలటరీ సర్వీస్ నుండి రామ్ టెంపుల్ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ భాయ్ సోంపురా, సీజేఐ డివై చంద్రచూడ్, మాజీ సీజేఐ శరద్ అరవింద్ బాబ్డే, యుఆర్ లలిత్, మహేశ్ జెఠ్మలానీ, తుషార్ మెహతా,అరుణ్ పూరీలులు రామాల‌యం ప్రాణ ప్ర‌తిష్ఠ‌లో పాలుపంచుకోనున్నారు.

Latest Videos

click me!