Delhi Rain : దేశ రాజధాని డిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నమంతా ఎండ మండిపోగా సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. ఈదురుగాలులకు తోడు దుమ్ముదూళి గాల్లోకి లేచింది. పనులు ముగించుకుని ఇంటికివెళ్లే సమయంలో గాలిదుమారం మొదలవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.
కేవలం ఈదరుడగాలులే కాదు చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. బతమైన గాలుల వల్ల చాలా చెట్లు నేలకొరిగాయి... విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నారు. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి రాజధాని నగరంలోని చాలాప్రాంతాలు అందకారంగా మారాయి.
ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుని చీకట్లు కమ్ముకున్నాయి. ఇలా వాతావరణ పరిస్థితి దారుణంగా మారడంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి నడిచే 15 విమానాలను దారి మళ్లించారు.. అలాగే చాలా ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవాళ రాత్రంతా వాతావరణ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశాలు ఉండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాత్రి 9 గంటలవరకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని ఐఎండి తెలిపారు.
ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో తుఫాను కారణంగా చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. చాలా చోట్ల చెట్లు కూడా పడిపోయాయి. రోడ్డు మీద చెత్తాచెదారం ఉండటం వల్ల ట్రాఫిక్ ఆగిపోయింది. తుఫాను సమయంలో దుమ్ము, ధూళి ఎగరడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.