వేగంగా పెరుగుతున్న HMPV కేసులు: మళ్లీ లాక్‌డౌన్ చేస్తారా?

First Published | Jan 7, 2025, 3:11 PM IST

చైనాలో ప్రారంభమైన HMPV వైరస్ విజృంభణ ఇప్పుడు భారత్ ను భయపెడుతోంది. ప్రస్తుతం మనదగ్గర ఒక్కోటిగా కేసులు బైటపడుతున్నాయి. ఈ ఈ వైరస్ కూడా కోవిడ్-19 లక్షణాలే కలిగివున్నాయి... ఈ క్రమంలోనే దీని నియంత్రణకు కూడా లాక్ డౌన్ మాదిరిగా సీరియస్ యాక్షన్ తీసుకుంటారా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. 

లాక్‌డౌన్ వస్తుందా?

COVID-19 లాంటి మరో వైరస్ ఇప్పటికే మన పొరుగుదేశం చైనాలో వేగంగా విస్తరిస్తోంది. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (HMPV) కేసులు ఇప్పుడు భారతదేశంలో పెరుగుతున్నాయి. నిన్న సోమవారం (జనవరి 6న) కర్ణాటక, గుజరాత్, తమిళనాడు  రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు బైటపడ్డాయి. ఇది గతంలో కోవిడ్-19 ప్రారంభ రోజులను గుర్తు చేస్తుంది.

అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వైరస్ కోవిడ్-19 అంత ప్రమాదకరం కాదని చెబుతోంది. వ్యాప్తిని అడ్డుకోడానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డా HMPV వ్యాప్తి గురించి స్పందించారు. ఈ వైరస్ ప్రమాదకరం కాదని... ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు.

భారతదేశంలో HMPV

HMPV కేసులు దేశంలో బైటపడ్డ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తం అయ్యిందని కేంద్ర మంత్రి నడ్డా తెలిపారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఈ వైరస్ ను నియంత్రించవచ్చని...  శ్వాస సంబంధిత సమస్య ఎదురైతే వెంటనే వైద్య సహకారం తీసుకోవాలని సూచించారు. 

" HMPV అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్వాసకోశ వైరస్. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ఇది చాలా సంవత్సరాలుగా చెలామణిలో ఉన్నప్పటికీ ఇటీవల చైనాలో విజృంభించింది. ఇది ఇప్పుడు భారత్ లో కూడా బైటపడింది. అయితే ఇది ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు'' అని కేంద్ర మంత్రి నడ్డా సూచించారు.


కోవిడ్ లాంటి లక్షణాలు

ఈ HMPV వైరస్ లక్షణాలు కూడా COVID-19 లాగా ఉంటాయి, ఇదే ఇప్పుడు ప్రజల ఆందోళనకు కారణం అవుతోంది.   ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)తో సహా ప్రముఖ ఆరోగ్య సంస్థలు HMPV భారతదేశానికి కొత్తది కాదని, అందువల్ల భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు...  వ్యాప్తిని తగ్గించడానికి మార్గదర్శకత్వం అందిస్తున్నారు.

భారతదేశంలో HMPV వ్యాప్తి

ఇలా హెచ్ఎంపివి కేసులు పెరుగుతున్న వేళ  ఎక్స్ తో పాటు మిగతా సోషల్ మీడియాలో ప్లాట్‌ఫారమ్‌లలో #Lockdown ట్రెండ్ అవుతోంది. ప్రస్తుత HMPV పరిస్థితిని కోవిడ్-19 ఆరంభ రోజులతో పోలుస్తున్నారు.  2019 చివరలో వుహాన్‌లో ప్రారంభమైన కరోనా మహమ్మారి ఎంత భీభత్సం సృష్టించిందో అందరికీ తెలుసు... ఇదే పరిస్థితి ఇప్పుడు పునరావృతం అవుతుందా అనే భయం ప్రజల్లో మొదలైంది.

సేమ్ ఇలాగే జనవరి 2020లో భారత్ లో COVID-19 మొదటి కేసు బైటపడింది... దీని వ్యాప్తిని నియంత్రించడానికి దేశాన్ని ఎక్కడికక్కడ స్తంభింపజేసారు... ఇందుకోసం లాక్ డౌన్ విధించారు. దీంతో ఇప్పుడు కూడా ఇలాగే లాక్ డౌన్ విధిస్తారాా? అన్న చర్చ మొదలయ్యింది. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా

HMPVని కరోనా అంత డేంజర్ కాదు...దీన్ని సులువుగానే నియంత్రించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా  COVID-19 లా HMPV తీవ్రమైనది కాదని నిపుణులు భరోసా ఇస్తున్నప్పటికీ ప్రజలలో భయాలు మాత్రం తొలగడం లేదు. వీరి ఆందోళన అనేక రకాల చర్చలకు దారితీస్తోంది. 

 తరచుగా చేతులు కడుక్కోవడం, రద్దీ ప్రదేశాలలో మాస్క్ ధరించడం,సామాజిక దూరం పాటించడం వంటి ప్రాథమిక పరిశుభ్రత పద్ధతులను పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయి... ఇవే లక్షణాలు HMPV సోకినవారిలో వుంటుంది. కాబట్టిముందు జాగ్రత్తలు  పాటిస్తే HMPV వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి : 

HMPV వైరస్ ప్రమాదకరమా? ఇప్పటివరకు ఇండియాలో కేసులెన్ని? తెలంగాణ, ఏపీ పరిస్థితి?

ఇండియాలో తొలి HMPV కేసు .. 8 నెలల శిశువుకు పాజిటివ్ : ఇక కరోనా సీన్ రిపీట్ కావాల్సిందేనా?

HMPV : ఈ వైరస్ తో తెలుగు ప్రజలు జాగ్రత్త ... ఇది మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?

Latest Videos

click me!