Padma Shri Awards : చీరకొంగుతో రాష్ట్రపతిని ఆశీర్వదించి వైరల్ అవుతున్న మంజమ్మ జోగతి...

First Published Nov 10, 2021, 1:32 PM IST

పద్మశ్రీ అవార్డు అందుకున్న సమయంలో మంజమ్మ జోగతి రాష్ట్రపతి Ram Nath Kovindను తనదైన స్టైల్ లో ఆశీర్వదించి,  నమస్కరించిన తీరు సభికులను ఆకట్టుకుంది.

Manjamma Jogati

ట్రాన్స్ జెండర్లు ఈ పేరు వినగానే చాలా మందికి రోడ్డుమీద భిక్షాటన చేసుకునే వారే గుర్తుకు వస్తారు. లేదా టెంటు వేస్తే చాలు దబాయించి, నయానో, భయానో డబ్బులు వసూలు చేసేవారే గుర్తుకువస్తారు. అందుకే ఆ పేరు వినగానే భయం కూడా కలుగుతుంది. అయితే అందరూ అలాగే ఉంటారనుకుంటే పొరపాటే. వారిలో కూడా చాలామంది మంచి ఉద్యోగాలు చేసేవారు.. సమాజ సేవ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మంజమ్మ జోగతి.

Jogati Manajamma Receives Padma Shri award from Ramnath Kovind

Transgender అయినప్పటికీ మిగతా వారికి భిన్నంగా జీవితాన్ని గడుపుతుంది  మంజమ్మ. ఫోక్ డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది Manjamma Jogati. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం Padma Shri Awardతో సత్కరించింది. ఇక అవార్డు తీసుకునే వేళ మంజమ్మ ప్రవర్తించిన తీరు..  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో చూసిన Netizens ఆమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా పని చేసిన తొలి ట్రాన్స్ విమెన్ గా మంజమ్మ జోగతి  రికార్డులకెక్కారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న సమయంలో మంజమ్మ జోగతి రాష్ట్రపతి Ram Nath Kovindను తనదైన స్టైల్ లో ఆశీర్వదించి,  నమస్కరించిన తీరు సభికులను ఆకట్టుకుంది. మంజమ్మ జోగతి  తన చీర కొంగుతో రామ్ నాథ్ కోవింద్ కు దిష్టి తీసినట్లు చేశారు.

Manjamma Jogati

ఇది వారి స్టైల్ లో ఆశీర్వదించడం అన్నమాట. రామ్ నాథ్ కోవింద్ కూడా మంజమ్మ జోగతి  ఆశీర్వాదాన్ని స్వీకరించారు. ఇది చూసిన సభికులు చప్పట్లతో వారిరువురిని ప్రశంసించారు.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో  తెగ వైరల్ అవుతుంది.  ఇక దేశంలో పద్మశ్రీ అందుకున్న తొలి ట్రాన్స్ జెండర్ గా నిలిచారు మంజమ్మ జోగతి.

Manjamma Jogati

మంజమ్మ జోగతి  జీవితం..
మంజమ్మ దశాబ్దాల పాటు సామాజిక ఆర్థిక పోరాటాలు చేశారు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ తట్టుకుని, నిలబడి సన్మానాలు అందుకున్నారు. మంజమ్మ అసలు పేరు మంజునాథ్  శెట్టి.  యుక్త వయస్సులో తనను తాను స్త్రీగా గుర్తించిన తరువాత మంజమ్మగా పేరు మార్చుకున్నారు.

ఇక ఆమె కుటుంబం మంజమ్మను జోగప్పగా మార్చడానికి హోస్పేట్  సమీపంలోని హులిగేయమ్మ ఆలయానికి తీసుకువెళ్ళింది. ట్రాన్స్ జెండర్ ల సంఘం తమనుతాము రేణుక ఎల్లమ్మ దేవత సేవలో అంకితం చేసుకునే ప్రక్రియ jogappa.  ఇలా మారిన వారు దేవతను వివాహం చేసుకున్నట్లు భావిస్తారు.

Manjamma Jogati

పేదరికం, సాంఘిక బహిష్కరణ, అత్యాచారాల మధ్యనే మంజమ్మ జోగతి  పలు కళారూపాలు,  జోగతి నృత్యం, శ్రీ దేవతలను స్తుతిస్తూ కన్నడ భాషా జానపద పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు.

మంజమ్మ జోగతి సేవలకు గానూ  2006లో, ఆమెకు కర్ణాటక జానపద అకాడమీ అవార్డు లభించింది.  13 సంవత్సరాల తర్వాత అనగా 2019 లో,  ఆమె సంస్థ అధ్యక్షురాలు గా నియమితులయ్యారు.  2010లో  కర్ణాటక ప్రభుత్వం ఆమెను వార్షిక కన్నడ  రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. 

Padma Awards: పద్మ అవార్డు గ్రహీతలను ఆత్మీయంగా పలకరిస్తున్న పీఎం మోదీ (ఫోటోలు)

click me!