2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ పట్టుదలగా ఉంది.అయితే ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలని వైసీపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది. అయితే వచ్చేఎన్నికల్లో టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. జగనన్నే మన భవిష్యత్తు పేరుతో క్యాంపెయిన్ ను వైసీపీ ప్రారంభించనుంది. ఇదే తరహలో టీడీపీ కూడా కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తుంది.