దేశంలో వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే వంటనూనె ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం వంటనూనె కంపెనీలను ఆదేశించింది. దీంతో వంట నూనె ధరలను తగ్గించేందుకు కంపెనీలు అంగీకరించాయి. అంతర్జాతీయంగా వంట నూనె ధరలు తగ్గంతో దేశంలో కూడా నూనె ధరలు తగ్గించేందుకు కంపెనీలు అంగీకరించాయి. సుమారు కిలో నూనెపై రూ. 30 వరకు తగ్గించాలని కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆయా నూనె బ్రాండ్ల ఆధారంగా ధరలు ఉంటాయి.రష్యా, ఉక్రెయిన్ మధ్య మిలటరీ చర్య నేపథ్యంలో పొద్దు తిరుగుడు నూనె ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే వంట నూనె ధరలు కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదల కూడా వంట నూనెల పెరుగుదలకు కూడా కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.