NEET UG Exam 2022: నీట్ పరీక్షకు కేవలం 5 రోజులే ఉంది.. చివర్లో ఇలా ప్రిపేర్ అయితే ర్యాంక్ రావడం పక్కా

First Published Jul 12, 2022, 3:33 PM IST

మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందడానికి NEET UG పరీక్ష 2022కి హాజరుకానున్న విద్యార్థులకు ఇంకా  కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో ఎలాంటి ప్రిపరేషన్ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.

దేశంలోని 497 నగరాలు, భారతదేశం వెలుపల 14 నగరాల్లో ప్రవేశ పరీక్ష జూలై 17న జరగనుంది. ఈసారి పోటీ కూడా చాలా బలంగా ఉండనుండడంతో కట్ ఆఫ్ కూడా ఎక్కువగానే ఉంది. దీనికి కారణం ఈ ఏడాది దాదాపు 18 లక్షల 72 వేల 341 మంది అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, చివరి క్షణంలో ఎలాంటి వ్యూహం అనుసరిస్తే బాగుంటుందో తెలుసుకోవడం అవసరం, అప్పుడు పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం సులభం అవుతుంది. 

ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టండి
పరీక్ష ఇంకా కేవలం 5 రోజుల్లో ఉన్న నేపథ్యంలో  విద్యార్థులు రివిజన్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి. పరీక్షలో అడిగే ముఖ్యమైన అంశాలను ఎంపిక చేసుకోవాలి. ఈ అంశాలను మరో సారి రివిజన్ చేసుకోవాలి. అన్ని అంశాలకు సమానంగా సమయాన్ని కేటాయించండి. దీంతో మీ పరీక్షకు మంచి వ్యూహాన్ని సిద్ధం చేసి పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలరు. నీట్ పరీక్షలో స్కోరింగ్ సబ్జెక్టులు అయిన బాటనీ, జువాలజీలను తేలికగా తీసుకోవద్దు. అన్ని సబ్జెక్టులకు సమానంగా సమయం కేటాయించాలి. 

వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్ట్‌లు రాయండి..
సమయం చాలా తక్కువగా ఉన్నందున, మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవడం కోసం పరీక్షా హాల్ లో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం కూడా అవసరం. కాబట్టి ఈ ప్రవేశ పరీక్షకు హాజరు కాబోయే విద్యార్థులందరూ వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయాలి. తక్కువ సమయంలో మంచి ప్రిపరేషన్ ఇదే అని నిపుణులు చెబుతున్నారు.

నోట్స్ చదవండి
నీట్ మాత్రమే కాదు, ఏదైనా పరీక్ష చివరి నిమిషంలో రివిజన్ కోసం నోట్స్ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇవి ప్రిపేర్ కావడానికి చాలా సహాయపడతాయి విద్యార్థులు ఈ ఐదు రోజులలో నోట్స్‌ను విస్మరించవద్దు.  పాయింట్ వైస్ గా నోట్స్ చదవండి.

టైమ్ టేబుల్ తయారు చేయడం ద్వారా సిద్ధం అవ్వండి..
టైం టేబుల్ చాలా తప్పనిసరి, నిద్ర మానేసి ప్రిపేర్ అయితే పరీక్ష రోజు మీ ఆరోగ్యం దెబ్బతిని మొదటికే మోసం అవుతుంది. అందుకే టైం టేబుల్‌ను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ప్రతి ముఖ్యమైన అంశాన్ని టైమ్ టేబుల్ ప్రకారం సెట్ చేయండి తదనుగుణంగా అధ్యయనంపై దృష్టి పెట్టండి. తద్వారా ప్రతి సబ్జెక్ట్ మరియు ప్రతి టాపిక్ కవర్ చేయవచ్చు.

click me!