తెలంగాణలో భారీ వర్షాలు: విద్యా సంస్థలకు 3 రోజులు సెలవులు

Published : Jul 11, 2022, 06:25 PM IST

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు కేసీఆర్ సర్కార్ సెలవులను ప్రకటించింది.ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం.  

PREV
తెలంగాణలో భారీ వర్షాలు: విద్యా సంస్థలకు 3 రోజులు సెలవులు
cartoon

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో తతెలంగాణలో మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవును ప్రకటించింది. ఈ నెల 11 నుండి 13 వరకు సెలవులను ఇచ్చింది.  ఆదివారం నాడు వర్షాలు, వరదలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కోరారు. అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు.  ఇవాళ కూడా సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో వరద పరిస్థితిపై ఆరా తీశారు.భారీ వర్షాల నేపథ్యంలో పలు జిిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపారుఅవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా సీఎం కేసీఆర్ ఆదేశించారు.గోదావరిలో వరద ఉగ్ర రూపం దాల్చింది

click me!

Recommended Stories