గవర్నర్ల వ్యవస్థ మరోసారి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లకు ప్రభుత్వాలకు మధ్య ప్రత్యక్ష పోరు సాగుతున్న పరిస్థితి నెలకొంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలు మరోసారి గవర్నర్ల వ్యవస్థపై చర్చకు కారణమౌతున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో గవర్నర్లతో ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. గవర్నర్ల తీరుపై ఆయా ప్రభుత్వాలు విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణలో గవర్నర్ పై మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ విమర్శలు చేసిన ఘటనలు కూడా లేకపోలేదు. బడ్జెట్ ను ఆమోదించడం లేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి చర్చకు దారి తీసింది.