అనంత్ అంబానీ సోదరి ఈషా నేతృత్వంలోని అంబానీ కుటుంబ సభ్యులు .. రాధికను ఆహ్వానించడానికి ఆమె నివాసానికి వెళ్లడంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంత్, రాధికలతో కలిసి కుటుంబ సభ్యులు శ్రీకృష్ణ ఆలయానికి చేరుకుంటారు. సాంప్రదాయ లగ్నపత్రిక, వివాహా ఆహ్వాన పఠనం, గణేష్ పూజ నిర్వహిస్తారు. ప్రస్తుతం కొత్త జంట సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.