Published : Jan 23, 2023, 06:49 PM ISTUpdated : Jan 23, 2023, 06:50 PM IST
ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఇటీవలనే ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు చర్చించారు.
టీచర్ల బదిలీలపై త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. రాష్ట్ర మంత్రులు హరీష్ రావు , సబితా ఇంద్రారెడ్డిలు ఇటీవలనే ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. బడిలీల విషయమై ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రులు చర్చించారు. ఉపాధ్యాయ బదిలీల విషయమై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయనున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయాలని ఆందోళనలు చేస్తున్నారు. 317 జీవో పరిధి కింద బదిలీ అయిన వారికి కూడా బదిలీలు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఉపాధ్యాయులు హైద్రాబాద్ లో ఆందోళనలు నిర్వహించారు.