Bullet Train India: సముద్రం అడుగున దూసుకెళ్లే బుల్లెట్ రైలు.. రూట్ మ్యాప్ ఇదే

Published : Oct 26, 2026, 08:34 AM IST

Bullet Train India: భారత్ నయా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. జపాన్ సాంకేతికతతో మన దేశంలో రూపొందుతున్న డ్రీమ్ ప్రాజెక్ట్ బుల్లెట్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. భారత్ లో తొలి బుల్లెట్ రైలు 2027 చివరినాటికి ప్రారంభం కానుంది.

PREV
16
320 KMPH వేగంతో దూసుకెళ్లనున్న ఇండియన్ బుల్లెట్ ట్రైన్

మన దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే డ్రీమ్ ప్రాజెక్ట్ బుల్లెట్ రైలు కల త్వరలోనే సాకారం కాబోతోంది. ఇప్పటివరకు మనం కేవలం ప్రకటనల్లోనే విన్న ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్, ఇప్పుడు ప్రత్యక్షంగా రూపుదిద్దుకుంటోంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ భారీ ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. 2027 చివరి క్వార్టర్ లో భారతదేశంలో తొలి బుల్లెట్ రైలు సేవలు అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి.

26
508 కిలోమీటర్ల భారీ కారిడార్.. అహ్మదాబాద్ టు ముంబై

ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ మొత్తం 508 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల గుండా ఈ రైలు కారిడార్ సాగుతుంది. ఈ మార్గంలో మొత్తం 12 ప్రధాన రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.

• ఆ 12 స్టేషన్లు ఇవే: ముంబై (BKC), ఠాణే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి. రైలు గరిష్ఠంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే, సగటు వేగం గంటకు 300 కిలోమీటర్లుగా ఉండనుంది.

36
భూమికి 100 అడుగుల లోతులో 10 అంతస్తుల మేర అండర్‌గ్రౌండ్ స్టేషన్

ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత విస్మయపరిచే అంశం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద నిర్మిస్తున్న రైల్వే స్టేషన్. ముంబై బిజినెస్ హబ్ నడిబొడ్డున భూమికి దాదాపు 32 మీటర్ల లోతులో ఈ స్టేషన్‌ను తొవ్వుతున్నారు. ఇది దాదాపు 10 అంతస్తుల భవనం లోతుతో సమానం.

• మూడు లెవల్స్: ప్లాట్‌ఫారమ్, కాన్‌కోర్స్, సర్వీసెస్ ఏరియాలుగా 3 లెవల్స్ ఉంటాయి.

• భారీ ప్లాట్‌ఫారమ్‌లు: ఇక్కడ 400 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండే 6 ప్లాట్‌ఫారమ్‌లను నిర్మిస్తున్నారు.

46
సముద్రం లోపల 7 కిలోమీటర్ల ప్రయాణం: భారత్‌లోనే తొలి అండర్ సీ టన్నెల్

ఇంజినీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా ఈ కారిడార్‌లో 21 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. ఇందులో ఏకంగా 7 కిలోమీటర్ల భాగం సముద్రం కింద అనగా థాణే క్రీక్ అడుగున ఉన్న రాళ్లను తొలిచి తయారు చేస్తున్నారు. సముద్రం అడుగు భాగం నుంచి బుల్లెట్ రైలు గాల్లో తేలినట్లు దూసుకెళ్లడం ప్రయాణికులకు ఒక మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది.

56
500 ఏనుగుల బరువు ఉన్న యంత్రాలతో పనులు

ఈ సొరంగం నిర్మాణానికి ఉపయోగిస్తున్న టన్నెల్ బోరింగ్ మిషన్లు భారతదేశ చరిత్రలోనే అతిపెద్దవి.

• జూలై 2026 నాటికి విక్రోలి, సావ్‌లి నుంచి ఈ భారీ టన్నెల్ బోరింగ్ యంత్రాలను రంగంలోకి దించారు.

• ఈ మిషన్ల కట్టర్‌హెడ్ డయామీటర్ 13.6 మీటర్లు. అంటే దాదాపు ఒక 4 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుంది.

• ఒక్కో యంత్రం బరువు 3,000 టన్నులకు పైమాటే. అంటే సుమారు 500 ఆసియా ఏనుగుల బరువుతో సమానం.

• ఈ మిషన్ పొడవు 96 మీటర్లు, ఇది మన క్రికెట్ స్టేడియంలోని 5 పిచ్‌ల పొడవు ఉంటుంది.

66
2027 నాటికి సరికొత్త ట్రావెల్ విప్లవం

అత్యంత వేగవంతమైన ప్రయాణంతో పాటు పర్యాటక రంగం, బిజినెస్ కనెక్టివిటీకి ఈ బుల్లెట్ రైలు తిరుగులేని మైలేజ్ ఇవ్వనుంది. ముంబై నుంచి అహ్మదాబాద్‌కి గంటల్లో ప్రయాణించే రోజులు ఇక ఎంతో దూరంలో లేవు. జపాన్ షింకన్సేన్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న ఈ గ్రీన్ అండ్ హైస్పీడ్ కారిడార్ భారత రవాణా వ్యవస్థ స్వరూపాన్నే మార్చేయనుంది.

Read more Photos on
click me!

Recommended Stories