క్యాన్సర్ రోగులకు బంగారం లాంటి కబురు !

Published : Feb 01, 2025, 06:20 PM ISTUpdated : Feb 01, 2025, 06:21 PM IST

Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ మొత్తంగా రూ. 50,65,345 కోట్ల కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ క్ర‌మంలోనే క్యాన్స‌ర్ రోగులకు బంగారం లాంటి క‌బురు చెప్పారు.  

PREV
15
క్యాన్సర్ రోగులకు బంగారం లాంటి కబురు !

Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పిస్తూ, మన ఆర్థిక వ్యవస్థ అధిక వేగంతో వృద్ధి చెందుతోందని అన్నారు. దీంతో గత 10 సంవత్సరాలలో ప్రపంచం దృష్టిని ఆకర్షించామని చెప్పారు.

25
Budget 2025 On Life-Saving Drugs

అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణ‌మే ల‌క్ష్యం: నిర్మలా సీతారామ‌న్  

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ, మా దృష్టి పేద, యువత, అన్నదాత, మహిళా శక్తిపై ఉంది. దీనితో పాటు, ఆరోగ్యం, తయారీ, మేకింగ్ ఇండియా, ఉపాధి, ఆవిష్కరణలపై కూడా ఉంద‌ని చెప్పారు. తాము వ్యవసాయం, ఎగుమతులపై కూడా పని చేస్తున్నామనీ, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తయారు చేయడమే త‌మ లక్ష్యమ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి స్ప‌ష్టం చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థకు ఊపు వస్తుంది. ఇది అభివృద్ధి చెందిన భారతదేశ బడ్జెట్ అని నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో క్యాన్స‌ర్ రోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు.

35

అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ చికిత్స సెంట‌ర్లు 

కేంద్ర బడ్జెట్ 2025లో మెడికల్ రంగానికి భారీ ప్రోత్సాహకాలు ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. క్యాన్సర్‌ వంటి అరుదైన వ్యాధులకు సంబంధించిన ఔషధాలపై  పన్నులు తగ్గించే చర్యలను ప్రకటించారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డేకేర్ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 

3 సంవత్సరాలలోపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 200 క్యాన్సర్ డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్లకు ఆరోగ్య సంరక్షణ అందించనున్నట్లు కూడా నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఆర్థిక మంత్రి ప్రకటించిన విధంగా 2025-26 కాలంలో 200 కేంద్రాలను ప్రారంభించడంతో పాటు వచ్చే మూడేళ్లలో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డేకేర్ క్యాన్సర్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత శనివారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో హాస్పిటల్ స్టాక్స్ ట్రెండ్ అయ్యాయి. 

45
Union Budget 2025

రాబోయే ఐదేళ్లలో 75,000 మెడికల్ సీట్ల పెంపు 

అలాగే, రాబోయే ఐదేళ్లలో 75,000 మెడికల్ సీట్లను పెంచే లక్ష్యంలో భాగంగా వచ్చే సంవత్సరంలో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో అదనంగా 10,000 సీట్లు సృష్టించబడతాయి. వచ్చే మూడేళ్లలో ప్రతి జిల్లా ఆసుపత్రిలో డేకేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. 

2025-26 సంవత్సరంలో 200 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు. అదనంగా, Gig కార్మికులు PM-JAY కార్యక్రమం కింద ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పొందుతారని ఆమె ప్రకటించారు, ఈ చర్య దాదాపు 1 కోటి మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

55
Union Budget 2025

36 ఔషధాలను ప్రాథమిక కస్టమ్స్‌ సుంకం నుంచి మినహాయింపు 

ప్రస్తుత బడ్జెట్‌లో క్యాన్సర్ చికిత్సకు ప్రాధాన్యత లభించింది. నిర్మలా సీతారామన్ క్యాన్సర్ మందులతో సహా అనేక ప్రాణాలను రక్షించే మందులకు మినహాయింపులు లేదా కస్టమ్స్ డ్యూటీలో తగ్గింపులను ప్రకటించారు. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 36 రకాల ప్రాణాలను రక్షించే మందులను కస్టమ్స్ సుంకం నుండి మినహాయించామని, మరో ఆరు రకాల మందులకు 5% తగ్గింపు రాయితీ సుంకం ఇచ్చినట్టు తెలిపారు. 

అదనంగా, ఈ ఔషధాల తయారీకి బల్క్ డ్రగ్ కొనుగోళ్లు కస్టమ్స్ సుంకం నుండి మినహాయించబడతాయి లేదా రాయితీ రేటుతో అందుబాటులో ఉంటాయని తెలిపారు. 37 కొత్త మందులు, 13 పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌లకు కస్టమ్స్ డ్యూటీ నుండి మినహాయింపు ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. కాగా, మధ్యంతర బడ్జెట్ సమయంలో ప్రభుత్వం ఇప్పటికే మూడు అధునాతన క్యాన్సర్ నిరోధక చికిత్సలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది.

Read more Photos on
click me!

Recommended Stories