BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!

Published : Sep 12, 2026, 01:58 PM IST

న్యూఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు వచ్చే ప్రముఖుల కోసం జైపూర్‌కు చెందిన అరుణ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రత్యేకంగా వెండి పూత పూసిన పాత్రలను తయారు చేసింది. G20 సదస్సులోనూ వాడిన ఈ పాత్రలు, ఆధునిక, సంప్రదాయ డిజైన్ల కలయికతో ఆకట్టుకుంటున్నాయి.

PREV
13
బ్రిక్స్ సదస్సు కోసం జైపూర్ సంస్థ ప్రత్యేక వెండి పాత్రలు

న్యూఢిల్లీలో జరగబోయే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే దేశాధినేతలు, ఇతర ప్రముఖుల కోసం జైపూర్‌కు చెందిన ఓ సంస్థ ప్రత్యేకమైన వెండి పాత్రలను సిద్ధం చేసింది. అరుణ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భారతీయ ఆతిథ్య సంప్రదాయాన్ని చాటిచెప్పేలా ఈ వెండి పూత పూసిన పాత్రలను రూపొందించింది. ఈ కలెక్షన్‌ను చూస్తే మన పండగలకు, శుభకార్యాలకు వాడే పాత్రల్లాగే ఉన్నాయి. సాధారణ డిజైన్లు కాకుండా అద్భుతమైన వెండి నగిషీ పనితనంతో ఇవి ఆకట్టుకుంటున్నాయి. ఇందులో వెండి గిన్నెలు, ట్రేలు, పళ్లాలు, సర్వింగ్ డిష్‌లతో పాటు అనేక అలంకరణ పాత్రలు కూడా ఉన్నాయి. ఆహారాన్ని వడ్డించడానికి పెద్ద అలంకరణ గిన్నెలు, మూతలు ఉన్న పాత్రలను కూడా తయారు చేశారు.

23
ఆధునిక, సంప్రదాయ డిజైన్ల కలయిక

ఈ పాత్రల తయారీ గురించి అరుణ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ అరుణ్ పబువాల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ''ఇలాంటి ప్రత్యేక పాత్రలను తయారు చేయడం మాకు కొత్తేమీ కాదు. గతంలో 2023లో జరిగిన G20 సదస్సుతో పాటు, దేశంలో జరిగిన అనేక వీఐపీ కార్యక్రమాలకు, విదేశీ అధ్యక్షుల పర్యటనలకు కూడా మేమే పాత్రలను అందించాం. వీటి డిజైనింగే చాలా ప్రత్యేకం. ప్రతి వంటకానికి వేర్వేరు కాన్సెప్ట్‌తో డిజైన్ చేశాం. మా పాత్రలు ఆధునిక, సంప్రదాయ డిజైన్ల కలయికతో ఉంటాయి" అని ఆయన చెప్పారు.

'నాణ్యతే మా బలం'

"మా ఉత్పత్తుల ప్రత్యేకతే నాణ్యత. అత్యుత్తమ నాణ్యత ఇస్తేనే ఇలాంటి పెద్ద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. బేస్ మెటీరియల్, డిజైన్, ప్లేటింగ్ విషయంలో మేం అస్సలు రాజీపడం. మా ఉత్పత్తులన్నీ బరువుగా ఉంటాయి. కోటింగ్ కూడా పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. ఫినిషింగ్ ప్రాసెస్ చాలా పెద్దది. మొదట్నుంచి చివరి వరకు పది దశల్లో ఫినిషింగ్ చేస్తాం. ప్లేటింగ్ తర్వాత, బయటకు పంపే ముందు కూడా మరోసారి ఫినిషింగ్ చేస్తాం" అని అరుణ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ వివరించారు.

33
భారత్ అధ్యక్షతన 18వ బ్రిక్స్ సదస్సు

ఇదిలా ఉంటే 18వ బ్రిక్స్ సదస్సు-2026 కోసం ఇప్పటికే రష్యా, చైనా దేశాల అద్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, జిన్ పింగ్ ఇండియాకు చేరుకున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు మాటమేల సిరిల్ రామపోసా, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, వియత్నాం ప్రధాని లే మిన్ హంగ్ కూడా డిల్లీలో ఉన్నారు.

ఇక బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులుగా నైజీరియా వైస్ ప్రెసిడెంట్ సెనేటర్ కాశీం శెట్టిమా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా అల్ సిసి, యూఏఈ షేక్ ఖాలిద్ మిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ సహ్యాన్, ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీలు ఇండియాకు చేరుకున్నారు. బురుండి, ఇండోనేషియా, పిలిప్పిన్స్ అధ్యక్షులు కూడా ఇప్పటికే డిల్లీకి విచ్చేశారు. ఇవాళ (సెప్టెంబర్ 12, శనివారం) మధ్యాహ్నం బ్రిక్స్ దేశాల అధినేతలంతా సమావేశం కానున్నారు... కీలక అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.

2026 సంవత్సరానికి గాను భారత్ అధ్యక్షతన సెప్టెంబర్ 12-13 తేదీల్లో అంటే ఇవాళ, రేపు (శని, ఆదివారం) 18వ బ్రిక్స్ సదస్సు జరగనుంది. 'స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం' అనే థీమ్‌తో భారత్ ఈ సదస్సుకు నేతృత్వం వహిస్తోంది. అభివృద్ధి, సుస్థిరత, ఆవిష్కరణలే ఈ సదస్సులో కీలక అంశాలు.

ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడటంలో బ్రిక్స్ ఒక ముఖ్యమైన ప్లాట్ ఫామ్ గా మారింది. అభివృద్ధి, ఫైనాన్స్, టెక్నాలజీ, వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు దీని అజెండాలో ఉన్నాయి.

ప్రస్తుతం ఈ BRICS కూటమిలో 11 దేశాలు ఉన్నాయి. అవి - బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ. వీటితో పాటు 10 భాగస్వామ్య దేశాలు కూడా ఉన్నాయి. అవి - నైజీరియా, బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్థాన్, మలేషియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, వియత్నాం

Read more Photos on
click me!

Recommended Stories