జూలై 2న ఆదేశ్ రాంబిరిని తన ఇంటికి కలుద్దామని పిలిచాడు. ఆమె రాగానే అతని స్నేహితులతో కలిసి ఆమెను ఇటుకలతో కొట్టి చంపి, మృతదేహాన్ని పొలంలో పడేశారు. జూలై 2న మహిళ హత్యకు గురైందని, ఒక రోజు తర్వాత ఆమె మృతదేహం పొలంలో లభ్యమైందని పోలీసులు ధృవీకరించారు.
మహిళకు, నిందితులకు మధ్య సంబంధాలు ఉన్నాయని కూడా పోలీసులు తెలిపారు. ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులు దీపక్, ఆర్యన్, సందీప్, రోహిత్‌లు కూడా పోలీసుల అదుపులో ఉన్నారని, తదుపరి విచారణ కొనసాగుతోంది.