60యేళ్ల మహిళపై సామూహిక అత్యాచారం.. గుడికి వెడుతుండగా కిడ్నాప్ చేసి..

Published : Jul 06, 2023, 11:51 AM IST

చంఢీగర్ లో పట్టపగలు దారుణ ఘటన వెలుగు చూసింది. గుడికి వెడుతున్న ఓ 60యేళ్ల మహిళను కిడ్నాప్ చేసి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

PREV
16
60యేళ్ల మహిళపై సామూహిక అత్యాచారం.. గుడికి వెడుతుండగా కిడ్నాప్ చేసి..

చండీగఢ్ : ఆటోలో గుడికి వెడుతున్న ఓ 60 ఏళ్ల మహిళను ఆటో డ్రైవర్, అతని స్నేహితుడు కలిసి  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఆమెను దారుణంగా కొట్టారు. ఆమె స్పృహతప్పడంతో చనిపోయిందనుకుని కైంబ్వాలా సమీపంలోని అడవిలో పడేశారని బుధవారం పోలీసులు తెలిపారు. 

26

ఈ దారుణ ఘటన సోమవారం మధ్యాహ్నం పట్టపగలు చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఆ మహిళ సాకేత్రి దేవాలయం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా కైంబ్వాలా సమీపంలో ఓ ఆటో వచ్చి ఆమె పక్కన ఆగింది. లోపల ఇద్దరు పురుషులు ఉన్నారు. వారు ఆమెను ఎక్కడికి వెడుతున్నారని ఆరాతీశారు. ఆమె చెప్పిన తరువాత తాము కూడా సాకేత్రికి వెళ్తున్నామని..  డ్రాప్ చేస్తానని చెప్పి..  డ్రైవర్ ఆమెను ఒప్పించాడు. 

36

దీంతో ముందు కాస్త వెనకాడిన ఆ మహిళ..అయిష్టంగానే ఆ మహిళ ఆటో ఎక్కానన సెక్టార్ 3 పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. కాసేపటి తరువాత తాము ఆలయానికి చేరుకున్నామని డ్రైవర్ చెప్పడంతో.. ఆమె దిగి చూడగా.. అది వేరే మతస్థలానికి చెందిన ప్రదేశం అని ఫిర్యాదులో పేర్కొంది. 

46

తాను వెళ్లాలనుకున్న ఆలయం అది కాదని మహిళ అభ్యంతరం చెప్పడంతో, నిందితుడు ఆమెను సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఇద్దరు కలిసి ఆమెను కొట్టారు. ఆ తరువాత ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయాల కారణంగా మహిళ స్పృహతప్పి పడిపోయింది.

56

ఆమె చనిపోయిందని భావించి నిందితులిద్దరూ పారిపోయారు. దాదాపు ఏడెనిమిది గంటల తర్వాత ఆ మహిళ స్పృహలోకి వచ్చి ఎలాగోలా అర్థరాత్రి ఇంటికి చేరుకుంది. తనకు జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

66

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ (పీసీఆర్) వాహనాన్ని పంపించి ఆమెను గవర్నమెంట్ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్, సెక్టార్ 16కి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు జరిపి వైద్య పరీక్షలో లైంగిక వేధింపులు జరిగినట్లు నిర్ధారించబడింది. ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

click me!

Recommended Stories