Gujarat BJP: గుజరాత్ రాజకీయాల్లో ఎందుకీ సడెన్ ఛేంజ్.. బీజేపీ టార్గెట్ ఏంటి.?

Published : Oct 18, 2025, 02:55 PM IST

Gujarat BJP: గుజరాత్ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవల కేబినేట్ పునర్వ్యవస్థీకరణ కూడా జరిగింది. మరి ఆ వ్యూహం ఏంటి అన్నది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.

PREV
15
గందరగోళమా.. వ్యూహంలో భాగమా..

గుజరాత్ రాజకీయ వేదికపై అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నితీష్ కుమార్ కేబినేట్‌లోని గురువారం 16 మంది మంత్రులు రాజీనామా చేయగా.. కొత్త కేబినేట్ ను బీజేపీ శుక్రవారం ఏర్పాటు చేసింది. ఇది గందరగోళమా.. లేక.. వ్యూహంలో భాగమా అనేది రాజకీయ విశ్లేషకులకు అర్ధం కావట్లేదు. అయితే గుజరాత్ బీజేపీకి ఇది కొత్త కాదు.. ఇది ఒక 'రాజకీయ రిఫ్రెష్ బటన్' లాంటిది. మార్పు పట్ల భయం లేకుండా.. దానిని మానసికంగా స్వీకరించే సంస్కృతి అక్కడ బీజేపీ అలవరుచుకుంది.

25
గుజరాత్ – బీజేపీకి రాజకీయ ప్రయోగశాల

గత మూడు దశాబ్దాలుగా గుజరాత్ బీజేపీకి ఒక పొలిటికల్ ల్యాబొరేటరీగా మారింది. ఇక్కడ పార్టీ ప్రతీసారి సరికొత్త వ్యూహాలను అమలు చేస్తూ.. ఓటర్ల విశ్వాసాన్ని చూరగుంటోంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, స్థానిక నాయకత్వ మార్పులు లాంటివి గుజరాత్ బీజేపీకి కొత్త కాదు. ప్రతిసారి కొత్త ముఖాలు కేబినేట్ లోకి వస్తున్నా.. పార్టీ సిద్ధాంతం మాత్రం అచంచలంగా ఉంటుంది. ఇదే గుజరాత్ బీజేపీని 'సంస్కరణలతో స్థిరత్వం సాధించే పార్టీ'గా నిలిపింది.

35
మోదీ విజన్, షా వ్యూహం – గుజరాత్ బీజేపీకి రెండు స్థంభాలు

గుజరాత్‌లో బీజేపీ ఈ స్థాయి స్థిరత్వాన్ని సాధించడం వెనుక ఇద్దరు కీలక సూత్రధారులు ఉన్నారు. ప్రధాని మోదీ విజన్, కేంద్రమంత్రి అమిత్ షా ఆర్గనైజేషనల్ డిసిప్లిన్.. ఇవే ఆ పార్టీని బీహార్ లో నెంబర్ వన్ గా నిలిపాయి. మోదీ రాజకీయ తత్త్వం ప్రజలతో అనుసంధానం చేస్తే.. అమిత్ షా యంత్రాంగాన్ని సరైన పద్దతిలో పనిచేసేలా చేయడమే కాదు.. ప్రతి నిర్ణయాన్ని నియంత్రిత పద్ధతిలో అమలు అయ్యేలా చేశారు.

45
మార్పు మంచికే.. అదే శక్తిగా మార్చుకున్న బీజేపీ

చాలా పార్టీల్లో మార్పు అంటే అంతర్గత అసంతృప్తి, విభేదాలు లాంటి కారణాలు ఉండొచ్చు. కానీ గుజరాత్ బీజేపీ మార్పును ఓ శక్తిగా మార్చుకుంది. వారు పక్కనపెట్టే నాయకులకు గౌరవం ఇవ్వడమే కాదు.. మార్పు దేనికి అనేది అర్ధమైలా చెప్పి.. యువ రక్తానికి అవకాశం ఇస్తారు. ఇలా నాయకులూ ప్రతీసారి మారుతున్నా.. పార్టీ సిద్దాంతం మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంది.

55
గుజరాత్ మోడల్ – ‘Expect the Unexpected’

గుజరాత్ బీజేపీ ప్రతీసారి ఒకే సిద్దాంతాన్ని ఆచరణలో పెట్టింది. కేబినేట్ పునర్వ్యవస్థీకరణ అనేది పార్టీకి ప్రమాదం కాదని.. అదే రాజకీయ వ్యూహం అని చాటి చెప్పింది. ప్రతి ఐదు సంవత్సరాలకోసారి పార్టీ తనంతట తానుగా రిడిజైన్ అవుతూ ఉంటుంది. ప్రజల్లో అప్పటిదాకా పాలించిన నాయకులపై చిరాకు కలగకుండా .. వెంటనే వారి స్థానంలో వేరేవారిని పెట్టి అభివృద్ధికి ముందడుగు వేస్తారు. ఇదే కారణంగా గుజరాత్‌లో బీజేపీ మూడు దశాబ్దాలుగా ఓటర్ల విశ్వాసాన్ని కోల్పోకుండా నిలుస్తోంది.

click me!

Recommended Stories