నితీష్ vs తేజస్వీ : బీహార్ కింగ్ ఎవరు? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే

Published : Nov 11, 2025, 06:28 PM ISTUpdated : Nov 11, 2025, 06:45 PM IST

Bihar Exit Polls: బీహార్‌లో రెండు విడతల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. 67.14 శాతం పోలింగ్ నమోదైందని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎగ్జిట్ పోల్స్‌ ఉత్కంఠ నెలకొంది.

PREV
14
నితీష్ కుమార్ Vs తేజస్వీ యాదవ్: బీహార్ లో ఉత్కంఠ పోరు

రెండు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ వైపు మళ్లింది. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి, తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఎవరిని బిహార్ బాద్‌షాగా చూపుతాయనే ఉత్కంఠ రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది.

24
రెండు విడతల్లో జరిగిన బీహార్ పోలింగ్

బీహార్ అసెంబ్లీకి మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. మొదటి విడతలో నవంబర్ 6న 18 జిల్లాల్లో 121 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈ విడతలో 64.46 శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడత నవంబర్ 11న 20 జిల్లాల్లో 122 స్థానాలకు జరగగా మధ్యాహ్నం 3 గంటల వరకే 60.40 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం నాటికి ఈ శాతం 67.14కి చేరిందని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఈసారి కిషన్‌గంజ్‌ జిల్లా అత్యధికంగా 76.26% పోలింగ్ నమోదు కాగా, కతిహార్‌లో 75.23%, పూర్ణియాలో 73.79%, సుపౌల్‌లో 70.69%, పూర్వి చంపారన్‌లో 69.02% పోలింగ్ నమోదైంది. నవాడా జిల్లాలో మాత్రం అత్యల్పంగా 53.17% పోలింగ్ నమోదైంది.

34
ప్రధాన పోటీ ఎవరి మధ్య ?

అధికార ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ విభాగం), హిందుస్తాన్ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా వంటి పార్టీలు ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూటమిలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, సీపీఐ (ఎంఎల్), సీపీఐ, సీపీఎం, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ, ఇండియన్ ఇన్‌క్లూజివ్ పార్టీలు ఉన్నాయి.

ఈ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా తన జన సురాజ్ పార్టీతో బరిలోకి దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

44
ఎగ్జిట్ పోల్స్ ఎవరివైపు ఉన్నాయి?

రెండో విడత ఓటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 6:30 గంటల తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. 2020 ఎన్నికల్లో తేలికపాటి మెజారిటీతో ఎన్డీఏ గెలుపొందగా, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని పలు సంస్థల సర్వేలు సూచిస్తున్నాయి. 

పీపుల్స్ పల్స్‌ ఎగ్జిట్ పోల్స్: 

  • ఎన్డీఏ కూటమికి 133 నుండి 159 సీట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. 
  • మహాఘట్‌బంధన్‌ కూటమికి 75 నుండి 101 స్థానాలు వచ్చే అవకాశముంది.
  • జన్ సురాజ్ పార్టీ ఈసారి మొదటిసారిగా పోటీ చేసినా, 0 నుండి 5 స్థానాలు రావచ్చు.
  • ఇతర స్వతంత్రులు, చిన్న పార్టీలు 2 నుండి 8 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని ఈ సర్వే తెలిపింది.
  • ఎన్డీయే 46. 2 శాతం ఓట్లు, మహాఘట్‌బంధన్‌ కు  37.9 శాతం, జన్‌ సురాజ్‌9.7 శాతం, ఇతరులకు 6.2 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.

టైమ్స్‌ నౌ

  • ఎన్డీయే 135-150 సీట్లు
  • మహాఘట్‌బంధన్‌ 83-105 సీట్లు
  • జన్ సురాజ్ పార్టీ (ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ)-1 సిటు
  • ఇతరులు 3-6 సీట్లు

 

నెట్‌వర్క్‌ 18

  • ఎన్డీయే 60-70
  • మహాఘట్‌బంధన్‌  45-55
  • జన్ సురాజ్ పార్టీ  0
  • ఇతరులు  0

ఎస్‌ఏఎస్‌ గ్రూప్‌

  • ఎన్డీయే 126-130 సీట్లు 
  • మహాఘట్‌బంధన్‌ 106-110 సీట్లు
  • జన్ సురాజ్ పార్టీ-7-10 సిట్లు
  • ఇతరులు 4-6 సీట్లు

దైనిక్‌ భాస్కర్‌

  • ఎన్డీయే 145-160 సీట్లు 
  • మహాఘట్‌బంధన్‌ 79-91 సీట్లు
  • జన్ సురాజ్ పార్టీ-0
  • ఇతరులు 5-10 సీట్లు

మేఘా ఎగ్జిట్‌ పోల్

  • ఎన్డీఏ  142-145 
  • మహాఘట్‌బంధన్‌  88-91 
  • జన్ సురాజ్ పార్టీ 0
  • ఇతరులు  0

మ్యాట్రైజ్‌

  • ఎన్డీఏ 147-167
  • మహాఘట్‌బంధన్‌ 70-90
  • జన్ సురాజ్ పార్టీ 0-5
  • ఇతరులు 2-8

 

చాణక్య స్ట్రాటజీస్

  • ఎన్డీఏ 130 - 138
  • మహాఘట్‌బంధన్‌ 100-108

పీమార్క్

  • ఎన్డీఏ 142-162
  • మహాఘట్‌బంధన్‌ 80-98
  • జన్ సురాజ్ పార్టీ 1-4
  • ఇతరులు 0-3

మరోసారి బీహార్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుందని ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పేర్కొంటున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories