LPG Cylinder Price : ఆగస్ట్ ఆరంభంలోనే అదిరిపోయే న్యూస్, తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్ లో ఎంత తగ్గిందో తెలుసా?

Published : Aug 01, 2026, 10:13 AM IST

ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ్టి నుండి 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఏకంగా రూ.200కి పైగానే తగ్గింది. ఈ తగ్గింపు హోటల్, రెస్టారెంట్ రంగాలకు పెద్ద ఊరటనివ్వనుంది.

PREV
15
భారీ తగ్గిన గ్యాస్ సిలిండర్‌ ధర

ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు ఊరట ఇచ్చాయి . గ్యాస్ కొరత, ధరలు భారీగా పెరగడంతో ఇబ్బంది పడుతున్న హోటల్స్, రెస్టారెంట్స్ యజమానులకు ఆగస్ట్ ఆరంభంలోనే అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి అంటే ఇవాళ్టి నుండే తగ్గిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఒక్క సిలిండర్‌పై సుమారు 200 రూపాయలకు పైగా ధర తగ్గింది.

25
హైదరాబాద్ సిలిండర్ ధర ఎంత తగ్గింది?

ఆగస్టు 1 నుంచి 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి తెలుగు నగరాలతో సహా దేశవ్యాప్తంగా న్యూఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.200 కంటే ఎక్కువగా తగ్గింది. హైదరాబాద్ లో రూ.206 తగ్గి రూ.2985 కి కమర్షియల్ సిలిండర్ ధర చేరింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సిలిండర్ ధర రూ.194 తగ్గి రూ.2691 కి చేరింది. చెన్నైలో రూ.200 తగ్గి రూ.2691 కి చెరింది. న్యూఢిల్లీలో సిలిండర్‌పై రూ.202, కోల్‌కతాలో రూ.209 తగ్గింంది… దీంతో ఢిల్లీలో కొత్త ధర రూ.2,738కి చేరగా, కోల్‌కతాలో 19 కేజీల సిలిండర్ ధర రూ.2,872.50గా నిర్ణయించారు.

35
గ్యాస్ సిలిండర్ ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

గత కొన్ని నెలలుగా మిడిల్ ఈస్ట్ యుద్దవాతావరణం, హర్మూజ్ లో రవాణా మార్గంలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఇండియాకు గ్యాస్ సరఫరా తగ్గడంతో కొరత ఏర్పడింది… దీంతో భారీ డిమాండ్ ఏర్పడి కమర్షియల్ సిలిండర్ ధర అమాంతం పెరిగాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో 3 వేల నుండి 4 వేల మధ్య పలికింది. కానీ ఇప్పుడు గ్యాస్ సరఫరా పెరగడంతో ధరలు తగ్గుతున్నాయి… తాజాగా రూ.200 తగ్గడంతో హైదరాబాద్ తో సహా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధరలు దిగొస్తున్నాయి. 

పశ్చిమాసియాలో సంక్షోభం, గ్లోబల్ ఇంధన మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఇటీవల ఆయిల్, గ్యాస్ ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి. అయితే ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో ఇంధన సరఫరా స్థిరపడుతోంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా, ఇండియాలోనూ కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించి మార్కెట్‌కు ఊతమివ్వాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. ఆ దిశగానే చర్యలు చేపట్టాయి.

45
వ్యాపార రంగానికి బిగ్ రిలీఫ్

సిలిండర్ ధర తగ్గించడం ఇది వరుసగా రెండోసారి… గత నెల జూలై ఆరంభంలోనూ ఇలాగే తగ్గించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ తగ్గింపు నిర్ణయం హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్, చిన్న పరిశ్రమలకు పెద్ద ఊరటనిచ్చింది. వాణిజ్య సంస్థలకు వంట గ్యాసే ప్రధాన నిర్వహణ వ్యయం (Operating Expense)… కాబట్టి ఇంధన ఖర్చు తగ్గడం హాస్పిటాలిటీ, ఫుడ్ సర్వీస్ రంగాలకు (Hospitality Sector) బూస్టర్ డోస్ లాంటిది.

55
గృహ వినియోగ సిలిండర్ ధర సంగతేంటి..?

కమర్షియల్ సిలిండర్ వాడేవారికి గుడ్ న్యూస్ వచ్చినా సాధారణ గృహిణులకు, గృహ వినియోగదారులకు ఎలాంటి ఊరట లభించలేదు. ఇళ్లలో వాడే 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు గృహ వినియోగ గ్యాస్ ధరను యథాతథంగా ఉంచాయి.

Read more Photos on
click me!

Recommended Stories